calender_icon.png 7 January, 2026 | 4:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా టీజీఓ నేత సత్యనారాయణ ఉద్యోగ విరమణ

05-01-2026 12:01:04 AM

అబ్దుల్లాపూర్‌మెట్, జనవరి 4: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ మాజీ జనరల్ సెక్రెటరీ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఏనుగుల సత్యనారాయణ పదవి విరమణ ఆత్మీయ అభినందన సభ శనివారం  రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేట్ లోని వీ ఆర్ సీ కన్వెన్షన్ హాల్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ పెద్దలతో పాటు, సంఘంలోని వివిధ డిపార్ట్ మెంట్ నుంచి పెద్ద ఎత్తున ఆఫీసర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ.. 14ఏళ్లుగా టీజీఓ సంఘానికి విశేష సేవలు సత్యనారాయణ అందించారన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఆయన సంఘం తరపున కూడా చాలా పనిచేశారన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎన్ని క్లిష్ట పరిస్ధితిలలో ఆయన నేను ఉన్న అని ముందుకు వచ్చి పనిచేశారన్నారు. ఉద్యోగ రీత్యా ఉన్నత స్థానంలో ఉన్నా కుడా అందరిని కలుపుకొని ముందుకు వెళ్ళేవాడని తెలిపారు.   ఏనుగు సత్యనారాయణ మొదటగా టీచర్ గా పనిచేసి ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ లో ఎస్త్స్ర స్థాయి నుంచి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పదవి విరమణ పొందారు.

గత 5 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ప్రభుత్వఉద్యోగుల బిల్లులను ఇచ్చిన మాట ప్రకారం రూ.4700 కోట్లు రూపాయలు ఇప్పటి వరకు ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించిన గణత సీఎం రేవంత్ రెడ్డిది పోరాడిన తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ ది అని గుర్తు చేశారు. దీనిలో సత్యనారాయణ చాలా కృషి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వారంతా సత్యనారాయణ దంపతులను సన్మానించారు. రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాస్ రావు, జనరల్ సెక్రెటరీ బీ.శ్యామ్,  ఏసీ ఛైర్మన్ మారం జగదీశ్వర్, మున్సిపల్ అధికారుల సంఘం నాయకులు తిప్పర్తి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.