15 March, 2026 | 1:22 AM

పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్

15-12-2025 01:48 AM

సూర్యాపేట, డిసెంబర్ 14 (విజయక్రాంతి) : నల్గొండ జిల్లా వ్యాప్తంగా జరు గుతున్న రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు, కొర్ర లక్ష్మి తో కలిసి ఆదివారం పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. దీనిలో భాగంగా మి ర్యాలగూడ డివిజన్లోని దామరచర్ల మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పోలింగ్ కేం ద్రానికి వచ్చిన ఓటర్లతో కలెక్టర్ మాట్లాడి, ఓటు హక్కు వినియోగం కోసం తీసుకువచ్చిన గుర్తింపు కార్డులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ ప్రక్రియపై ఓటర్ ల అభిప్రాయాలు సేకరించారు. తదుపరి పాఠశాల ఆవరణలోని ఒక పోలింగ్ బూత్ను పరిశీలించిన ఆమె పరిమితికి మించి ఓటర్లు ఉండడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్ర నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని భావించిన ప్రిసైడింగ్ అధికారి, స్కూల్ అసిస్టెంట్ సంధ్యకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రతిరోజూ టెలీకాన్ఫరెన్సులు, శిక్షణ కార్యక్రమాల ద్వారా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని హెచ్చరించారు. ఎన్నికల నిర్వహణలో నిర్ల క్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పోలింగ్ అనంతరం కౌంటింగ్ను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితు ల్లో ఆర్‌ఓలు బయటకు వెళ్లాల్సి వస్తే, తప్పనిసరిగా స్టాట్యూటరీ మెటీరియల్ ఒక గెజిటెడ్ అధికారికి అప్పగించి వెళ్లాలని సూచించారు.

పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్లు, ఎన్నికల సామగ్రిని సమీపంలోని ఎస్టీఓలో భద్రపరిచే బాధ్యత ఎంపీడీవోపై ఉంటుందని తెలిపారు.  మిర్యాలగూడ సబ్ కలెక్టర్, స్థానిక సంస్థల ఇన్చార్జ్, అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, డీపీఓ వెంకయ్య, దామరచర్ల ప్రత్యేక అధికారి, డీసీఓ పత్యా నాయక్, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి రమేష్ తదితరులు ఉన్నారు.