15-12-2025 01:49:50 AM
తుంగతుర్తి, డిసెంబర్ 14 : కీర్తిశేషులు గుడిపాటి పకీరు 7వ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుంగతుర్తి సహకార సొసైటీ చైర్మన్ గుడిపాటి సైదులు వారి సొంత గ్రామం వెలుగుపల్లి జడ్.పి.హెచ్.ఎస్ పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు వార్షిక పరీక్షలకు కావలసిన పరీక్ష ఫ్యాడులు, కంపాక్స్ బాక్సులు, పెన్నులు, పెన్సిల్లు రూ.4 వేల విలువ గలిగిన విద్యా సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు గొడుగు అబ్బయ్య, పకీరు గారి మనవడు ధర్మారపు సాయి తేజలు పాల్గొన్నారు