27 March, 2026 | 1:47 AM

భద్రాచలం అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

27-03-2026 12:00 AM

విలేకర్ల సమావేశంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు 

నేలకొండపల్లి (కూసుమంచి), మార్చి 26 (విజయక్రాంతి): దక్షిణ అయోధ్యగా పిలవబడే భద్రాచలం రామాలయంను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం నేలకొండపల్లి మండలం లో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పర్యటించారు. ఈసందర్భంగా కొరట్లగూడెం లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

నేలకొండపల్లి వాసి రామదాసు భద్రాచలం లో ఎన్నో కష్టాలు పడి  రామాలయం నిర్మించారన్నారు.గత ప్రభుత్వం భద్రాచలం ఆలయాన్ని పట్టించుకోలేదని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  జిల్లా మంత్రులు,ప్రజల కోరిక మేరకు విడతల వారీగా 560 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నరన్నారు. కేటీఆర్, కవిత లాంటి వాళ్ల్లు ఖమ్మం వచ్చి అవాకులు చెవాకులు పేలుతున్నరని ఆయన మండిపడ్డారు. గత పది సంవత్సరాల్లో అధికారంలో ఉండి వారు చేయని పనులు ముగ్గురు మంత్రులు చేసి చూపిస్తున్నరన్నారు.

జాతీయ రహదారులు, సాగు నీటి ప్రాజెక్టులు,విద్యారంగంలో, వైద్య రంగం లో ఖమ్మం జిల్లాను ముందుకు తీసుకుపోతున్నరని ఆయన చెప్పారు.పది సంవత్సరాల BRS పాలనలో  ఒక్క రెషన్ కార్డు ఇవ్వలేదని ఇందిరమ్మ ప్రభుత్వం లో పేదలకు రేషన్ కార్డులు ఇచ్చి సన్నబియ్యం ఇస్తున్నామని ఆయన వెల్లడించారు.రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని ఆయన అన్నారు.  డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్,మాజీ మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొడాలి గోవిందరావు, నెల్లూరి భద్రయ్య, రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి జెర్రిపోతుల అంజని, నేలకొండపల్లి యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యడవల్లి నాగరాజు, రాయగూడెం, రామచంద్రాపురం సర్పంచ్లు బోయిన వేణు,దుడ్డేల పవన్, కాంగ్రెస్ నాయకులు నంబూరి రామారావు, కొత్తపల్లి సుబ్బయ్య పాల్గొన్నారు