calender_icon.png 26 October, 2025 | 12:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గత ప్రభుత్వం చేయనటువంటి అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది

25-10-2025 12:18:07 AM

పెద్దాపూర్ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి...

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు

పెద్దపల్లి అక్టోబర్ 24 విజయ క్రాంతి) గత ప్రభుత్వం చేయనటువంటి అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. జుల్లపల్లి మండలం పెద్దాపూర్ గ్రామం నుండి కుర్మాపల్లి వరకు సీసీ రోడ్డు నూతన సీసీ రోడ్డు నిర్మాణం కోసం రూ. 1 కోటి రూపాయల నిధులతో ప్రభుత్వ అధికారులు స్థానిక నాయకులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వమని, అభివృద్ధి కొరాకు అహర్నిశలు కష్టపడుతున్న సీఎం రేవంత్ రెడ్డి కి మనం వెన్నంటి ఉన్న రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేసుకునే విధంగా ఉండాలన్నారు. నా వంతు పెద్దపూర్ గ్రామానికి కృషి చేస్తానని, రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బారి మెజారిటీతో గెలిపించుకొని గ్రామ అభివృద్ధి చేయించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు ఎస్సి. డిఈ. ఏఈ. ఎంపీడీవో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.