calender_icon.png 26 October, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభాగ్యులకు అభయహస్తం కరుణామూర్తి

25-10-2025 12:16:40 AM

ఈఎల్‌వీ ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్

చౌటుప్పల్, అక్టోబర్ 24 (విజయ క్రాంతి) : ఆర్థిక ఇబ్బందులు విద్యకు అడ్డంకి కాకూడదు ఏ విద్యార్థి కూడా విద్యకు దూరం కాకూడదని ఈ.ఎల్.వి భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ అన్నారు. ఎంబిబిఎస్‌లో ర్యాంకు సాధించిన పీపల్పహాడ్ గ్రామానికి చెందిన ఎర్ర మధుశ్రీ, మర్రిగూడెం చెందిన ఈదగిరి, కొండమల్లేపల్లికి   చెందిన అందుగుల తేజశ్రీ,

అందుగుల ప్రవల్లికలు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఎంబిబిఎస్ సీటు సాధించి వైద్య విద్యని అభ్యసించడానికి  వాళ్ళు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి ఈ ఎల్ వి భాస్కర్  పేదరికం చదువుకు అడ్డుగా మారొద్దని ఎంబీబీఎస్ విద్యార్థులకు ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ డైరెక్టర్ భాస్కర్ చేతుల మీదుగా ఒక్కొక్కరికి రూ,50వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా  మాట్లాడుతూ వారి చదువు పూర్తి అయ్యే వరకు ఫౌండేషన్ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. భవిష్యత్తులో నవ సమాజ నిర్మాణానికి తమ వంతు కృషిగా మంచి వైద్యులుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని తెలిపారు.