1 April, 2026 | 7:06 PM

Breaking News

కేంద్రమంత్రి బండి సంజయ్ నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలి   •   మురుట్ల పాఠశాలకు బాన్వి-ప్రహర్ష పౌండేషన్ టీవీ అందజేత   •   కరాటే పోటీలలో వివిధ స్థాయిలలో బెల్టులు సాధించిన సిద్దార్థ పాఠశాల విద్యార్థులు   •   అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్ కె.హరిత   •   అంబేద్కర్ సెంటర్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల   •   అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన 14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్   •   మున్సిపల్ చైర్ పర్సన్ నివేదితను కలిసిన ఆర్యవైశ్యులు   •   గర్రెపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం   •   హైదరాబాద్ డివై డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ కుమార్   •  

టేకులసోమారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

25-10-2025 12:18 AM

వలిగొండ, అక్టోబర్ 24 (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని టేకులసోమారం గ్రామంలో గల  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ చంద్రముగా పాఠశాలలో ఎంత మంది ఉపాధ్యాయులు ఉన్నారు రోజు వస్తున్నారా లేదా అని ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పదవ తరగతిలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు,

గత సంవత్సరం వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం ఎంత అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అందరూ కూడా ఇప్పటినుండే వార్షిక పరీక్షల కోసం సన్నద్ధం కావాలని, అత్యధిక మార్కులు వస్తే బాసర ట్రిపుల్ ఐటి లాంటి పెద్ద ఇనిస్టిట్యూట్లో సీటు వస్తుందని, దీంతో భవిష్యత్  బాగుంటుందని భవిష్యత్తులో స్థిరపడతారని అన్నారు. గత సంవత్సరం మాధురి ఈ విద్యా సంవత్సరంలో కూడా అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులకు సైకిల్ బహుమతిగా ఇస్తానని విద్యార్థుల తల్లిదండ్రులకు సన్మానం చేస్తామని అన్నారు.