calender_icon.png 29 May, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరంతర అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

28-05-2025 01:11:54 AM

-41 డివిజన్‌లో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం...

-రామగుండం ఎమ్మెల్యే రాజ్ రాజ్ ఠాకూర్

 గోదావరిఖని మే 27(విజయ క్రాంతి); నిరంతర అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ 41 డివిజన్లోని గాంధీ నగర్ లో ఎస్ డి ఎఫ్ స్పెషల్ ఫండ్ రూ. 5 లక్షల నిధుల తో సిసి రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రభుత్వ నిధులతో పాటు స్థానిక పరిశ్రమల సహకారంతో గోదావరిఖని పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు మీర్జా ఫజల్ బేగ్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు బొంతల రాజేష్, మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామి, ముస్తఫా, గట్ల రమేష్, కొలిపాక సుజాత, ఉమారాణి, శివ,విజయ్, కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల దశ తదితరులు ఉన్నారు.