28-05-2025 01:10:26 AM
-మంత్రి తో జూన్ 10 లోపు గృహ ప్రవేశాలు
-పెద్దపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలనలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
పెద్దపల్లి, మే -27 (విజయ క్రాంతి); పెద్దపల్లి లో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎంపిక చేసిన లబ్ధిదారులకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
మం గళవారం పెద్దపల్లి పట్టణంలోని చింతపల్లి, రాంపల్లిలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమ ణా రావు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ సముదాయం వద్ద ప్రజా ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్డు , త్రాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు.
పెండింగ్ ఉన్న చిన్న చిన్న పనులను పూర్తి చేసి ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నాడు అప్పగించాలని,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇంటి తాళాలు అప్పగించి, ఇండ్లు శుభ్రం చేయించాలని, ప్రతి ఒ క్కరికి ఓనర్ పేరు మీద విద్యుత్ మీటర్ మంజూరు చేయాలని, జూన్ 10 లోపు మంత్రి శ్రీధర్ బాబు సమయం తీసుకుని వారి చేతులమీదుగా లబ్ధిదారుల గృహ ప్రవేశం చేయించేందుకు అ వసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, సంబంధిత అధికారులు, పాల్గొన్నారు.