28-05-2025 01:13:29 AM
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల
జగిత్యాల, మే 27 (విజయక్రాంతి): ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్నత విద్యలు చదివితేనే భవిష్యత్తు ఉత్తమంగా ఉంటుందని కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు.
కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలోని శ్రీఅరుణోదయ డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన ఉత్తమ విద్యార్థుల అభినందన, స్కాలర్షిప్పుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత అనవసర ఆకర్షణలకు లోనవ్వకుండా, మంచి చదువులతో తాము ఎంచుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు.
ఒక్కొక్క విద్యార్థికి సెమిస్టర్కు రూ. 8 వేల 4 వందల చొప్పున 20 మంది విద్యార్థులకు రూ. 1 లక్ష 60 వేల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. అలాగే ఇంటర్మీడియట్ రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించిన పిఆర్బీఎం జూనియర్ కళాశాలకు చెందిన ద్వితీయ సంవత్సరంలో అంజుమ్ బైపిసి 993/1000, కార్తికేయ ఎంపీసీ 992/1000, అక్ష 978/1000 సీఈసీ, మొదటి సంవత్సరంలో భువనశ్రీ 436/440 బైపిసి, అబ్దుల్ కరీం 458/470 ఎంపీసీ, అక్షయ 474/500 సీఈసీ విద్యార్థినీ విద్యార్థులను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ పోతని ప్రవీణ్ కుమార్, ప్రిన్సిపల్ నవీన్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ భవాని, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.