22-07-2025 12:00:00 AM
నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి
గజ్వేల్, జులై 21: పేదల సంక్షేమానికి కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కడపల కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ములుగు మండలం అన్న సాగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ముగ్గు కార్యక్రమంలో పాల్గొన్నారు. వంటిమామిడి మార్కెట్ కమిటీ డైరెక్టర్ శశికాంత్ రెడ్డి తో కలిసి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.
దానికి నిదర్శనం ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కిందన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో మండలంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. అన్న సాగర్ మాజీ సర్పంచ్ సాదు మైపాల్ రెడ్డి, శంకర్ రెడ్డి, ఫారుక్ తదితరులు పాల్గొన్నారు.