calender_icon.png 22 July, 2025 | 10:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

22-07-2025 12:00:00 AM

ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వి రాజేంద్రప్రసాద్

మహబూబ్ నగర్ టౌన్ జూలై 21 : యన్. టి .ఆర్. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, అటానమస్ , మహబూబ్ నగర్ లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను,  ఇంగ్లీష్, హిందీ ,  సంస్కృతం , అరబిక్ , తెలుగు, కామర్స్, కంప్యూటర్స్ సైన్స్ & అప్లికేషన్, హిస్టరీ , పొలిటికల్ సైన్స్, జువాలాజీ, అప్లైడ్ న్యూట్రిషన్ , బయోటెక్నాలజీ , స్టాటిస్టికక్స్ , ఫిజిక్స్ , ఎకనామిక్స్ ఉర్దూ మీడియం, పొలిటికల్ సైన్స్ ఉర్దూ మీడియం సబ్జెక్టులలో అతిథి అధ్యాపకుల(గెస్ట్ ఫ్యాకల్టీ) కొరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వి.రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.

అభ్యర్థులు పీజీ  (పోస్ట్ గ్రాడ్యుయేషన్) లో సంబంధిత సబ్జెక్టులో 55% శాతం మార్కులు , ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50% శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. నెట్, స్లెట్, సెట్, పి.హెచ్.డి ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఫై సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకునేవారు, అన్ని సర్టిఫికెట్స్  జిరాక్స్ కాపీలతో ఈనెల 23వ తేదీన సాయంత్రం మూడు గంటల లోపు యన్. టి. ఆర్. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అటానమస్, మహబుబూనగర్ ఆఫిస్ లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో, ఈ నెల 24న ఉదయం 10:00 గంటలకు ఎన్. టి. ఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల,అటానమస్, మహబుబూనగర్ లో ఇంటర్వ్యూ (మౌఖిక పరీక్ష డేమో) కు హాజరు కావాలని పేర్కొన్నారు.