calender_icon.png 22 July, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూరాల వద్ద విషాదం.. కొంపముంచిన సెల్ ఫోన్ డ్రైవింగ్

22-07-2025 12:00:00 AM

కృష్ణా నదిలో పడి యువకుడు గల్లంతు...

గద్వాల, జూలై 21 ( విజయక్రాంతి ) : ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా కారును నడపడంతో ప్రమాదవశాత్తు పర్యాటకులపై కారు దూసుకెళ్లింది. ఈ క్రమంలో కారు టూ వీలర్ ను ఢీ కొట్టగా బైక్ ను నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగ, వెనుక కూర్చున వ్యక్తి ప్రమాదవశాత్తు ఎగిరిపడగా కృష్ణానదిలో పడి కొట్టుకపోయాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి జూరాల ప్రాజెక్టు వద్ద చోటు చేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారంగా జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడంతో జూరాలకు జళకళ సంతరించుకుంది. డ్యామేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తు న్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం కృష్ణమ్మ జలసవ్వడీలు డ్యాం అందాలను చూడటానికి పర్యాటకులు అధికంగా రావడం జరుగుతుంది.

ఈ క్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా మం డలం బూడిదపాడు (ఎ) గ్రామానికి చెందిన జానకి రాము, మహేష్ లు సైతం ఆదివారం సెలవు దినం కావడంతో జూరాల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు.

జూరాల ప్రాజెక్టు సందర్శన అనంత రం బైక్ పై గద్వాలకు తిరిగి వస్తున్న క్రమంలో జూరాల డ్యాం మీద కర్ణాటక చెందిన ఓ కారు డ్రైవర్ కారును నిర్లక్ష్యంతో నడపడంతో రాంగ్ రూట్ లో వెళ్లి టూ వీలర్ ను ఢీకొట్టగా టూవీలర్ నడుపుతున్న జానకిరామ్ కు తీవ్ర గాయాలయ్యాయి వెనకాల కూర్చున్న మహేష్ ప్రమాదవశాత్తు జూరాల డ్యాం గేట్ల ముందు పడి కృష్ణానదిలో గల్లంతయ్యాడు.

విషయాన్ని తెలుసుకున్న ధరూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. వరద ఉధృ తి ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలను చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున ప్రత్యేక బృందాలు కృష్ణానదిలో గాలింపు చర్యలు చేపట్టారు.