calender_icon.png 27 November, 2025 | 12:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంత జీవనానికి రాజ్యాంగమే మార్గదర్శకం

27-11-2025 12:27:48 AM

కలెక్టర్ వెంకటేష్ ధోత్రే 

కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): భారతదేశ పౌరులు తమ హక్కులతో ప్రశాంతంగా జీవించడానికి భారత రాజ్యాంగం మార్గదర్శకమని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర రావు, జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యా రు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ భారత రాజ్యాంగ విలువలు, ప్రాథమిక హక్కులు, పౌర హక్కులు, కర్తవ్యాలు, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి రాజ్యాంగ ఎంతో ఆవశ్యకమని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన మనదేశంలో వ్యవస్థను నిర్వహించడంలో మన దేశ రాజ్యాంగం అత్యంత కీలకమైనదని తెలిపారు.

రాజ్యాంగ పరిరక్షణ, దేశ అభివృద్ధికి కట్టుబడి పని చేయాలని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ప్రజాసేవలో నిబద్ధతతో ఉం డాలని తెలిపారు. అనంతరం అందరిచే భారత రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.