29 May, 2026 | 1:36 AM

30లోగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులను పూర్తి చేయాలి

29-05-2026 12:53 AM

జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ 

మిర్యాలగూడ, మే 28: మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతాల్లో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లలో పెండింగ్ పనులను ఈ నెల 30లోగా పూర్తిచేసి పంపిణీకి సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ బూరుగు చంద్రశేఖర్ అన్నారు.

మిర్యాలగూడ పట్టణంలోని శ్రీనివాస్ నగర్ గుమస్తా కాలనీలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను గురువారం స్థానిక ఎమ్మెల్యే బత్తు ల లక్ష్మారెడ్డి(బిఎల్ ఆర్) తో కలిసి పరిశీలించారు. వచ్చే నెల రెండు నాటికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. అనంతరం స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పనుల  పురోగతి,పంపిణీ పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు అవసరమైన సీసీ రోడ్లు, వాటర్ ట్యాంకులు, తాగునీటి నల్లాలు, విద్యుత్ పనులు, మరుగుదొడ్లు, విద్యుత్  నియంత్రికలు, వీధి దీపాలు తదితర మౌలిక వసతులను నిర్ణీత సమయంలో పూర్తిచేసి పంపిణీకి సిద్ధంగా ఉంచాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.

పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత, త్రాగునీటి పైపులైన్లు, ట్యాంకుల క్లో రినేషన్, విద్యుత్  నియంత్రికల చుట్టూ ఫెన్సింగ్ తదితర పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులు కోరారు. పనుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆయా పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ పిడి రాజకుమార్, ఆర్డీవో రమణారెడ్డి,తహశీ ల్దార్ శ్రీనివాస్, డీఈ లు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ  ఠాగూర్ రామకృష్ణ  తదితరులున్నారు.