calender_icon.png 21 December, 2025 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందాల నటుడు క్రెడిట్..ఇప్పటికీ శోభన్‌బాబుకే

21-12-2025 12:11:32 AM

అలనాటి హీరోయిన్ల జ్ఞాపకాల దొంతరలో ‘సోగ్గాడు’ స్వర్ణోత్సవం ఆద్యంతం ఆనందోత్సాహాల మధ్య సాగింది. దివంగత నటుడు శోభన్‌బాబు కథానాయకుడిగా కే బాపయ్య దర్శకత్వంలో డీ రామానాయుడు నిర్మించిన చిత్రం ‘సోగ్గాడు’. ఈ సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. సురేశ్ ప్రొడక్షన్స్, అఖిల భారత శోభన్‌బాబు సేవా సమితి ఆధ్వర్యంలో ఈ వేడుక ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో అలనాటి ప్రముఖ గాయని సుశీల మాట్లా తూ.. “ఈ సినిమాలోని పాటలకు నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

శోభన్‌బాబు సినిమాల్లో పాడిన ప్రతి పాటా నా మదిలో ఇంకా మెదులుతూ నే ఉంది” అని తెలిపారు. జయసుధ మాట్లాదుతూ.. ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే శోభన్‌బాబు గుర్తుకొచ్చి కొంత భావోద్వేగానికి గురయ్యాను. ఆయన సరసన అత్యధికంగా 38 చిత్రాల్లో హీరోయిన్‌గా నటించాను. నటనలోనూ, వ్యక్తిత్వంలోనూ ఆయనది ఓ ప్రత్యేక శైలి అని చెప్పుకొచ్చారు. పలువురు వక్తలు మాట్లాడుతూ.. శోభన్‌బాబు ఎన్నో చిత్రాల్లో విశిష్ట నటనతో ఆకట్టుకున్నారని తెలిపారు.

శోభన్‌బాబు క్రమశిక్షణ కలిగిన హీరో అని పేర్కొన్నారు. అందాల నటుడనే క్రెడిట్ అప్పటి కీ.. ఇప్పటికీ శోభన్‌బాబుకే చెందుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శోభన్‌బాబు మనవడు డాక్టర్ సురక్షిత్ మాట్లాడుతూ.. ‘ఈ స్వర్ణోత్సవం ద్వారా మనకు తెలిసేది ఏంటంటే.. లెజెండ్స్ ఎప్పుడూ మన హృదయా ల్లో ఉంటారు. తాత సినిమాల్లో ఎంత కష్టపడినా కుటుంబానికి, ఆయన అభిమానులకు తగినంత సమయం కేటాయించేవారు” అని చెప్పారు.

శోభన్‌బాబు మరో మనవడు సౌరబ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంకా నటీమణులు జయచిత్ర, రాధిక, సుమలత, పలువురు సినీప్రముఖులు, అఖిల భారత శోభన్‌బాబు సేవా సమితి గౌరవ చైర్మన్ నరసింహారావు, చైర్మన్ సుధాకర్‌బాబు, కన్వీనర్ సాయి కామరాజు, తెలంగాణ శోభన్‌బాబు అభిమానులు పాల్గొన్నారు.