calender_icon.png 21 December, 2025 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన జీవితం తెరపై చూసుకున్నట్టు..

21-12-2025 12:10:15 AM

రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ప్రచారంలో భాగంగా మేకర్స్ శనివారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ.. “మోడరన్ రిలేషన్‌షిప్ గురించి చాలా హ్యూమరస్ సెన్సిబుల్‌గా చెబుతున్నాం. ఇందులో నేను మానస శెట్టి పాత్రలో కనిపిస్తాను.

చాలా మోడరన్ కాన్ఫిడెంట్ బోల్డ్ క్యారెక్టర్.. అందరికీ నచ్చుతుంది. సినిమా చూస్తున్నప్పుడు సంక్రాంతి పండగలా ఉంటుంది” అని తెలిపింది. డింపుల్ మాట్లాడుతూ.. “ఇందులో నా క్యారెక్టర్ పేరు బాలమణి. కొత్త డింపుల్‌ని చూస్తారు. ఇది భోగి రోజు రిలీజ్ అవుతుంది. ఇది నా ఫస్ట్ సంక్రాంతి సినిమా. చాలా స్పెషల్‌” అని చెప్పింది. డైరెక్టర్ మాట్లాడుతూ.. “భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సంక్రాంతికి కచ్చితంగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మంచి ఫన్, సాంగ్స్ అన్నీ కలిపి 100% అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. మన జీవితం తెరపై చూసుకున్నట్టుగా ఉంటుంది.

రవితేజ ముందే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. నా గురించి కాకుండా నీ స్టైల్‌లో కథ చేస్తే క్యారెక్టర్ ఫ్రెష్‌నెస్ వస్తుందన్నారు. మేము కూడా ఈ సినిమాలో రామ్ సత్యనారాయణ క్యారెక్టర్‌నే ఫాలో అయ్యాం. ‘సంక్రాంతికి ఎంట ర్‌టైన్‌మెంట్ సినిమాలు బాగా ఆడుతాయి.. ఈ సంక్రాంతికి రావాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమా చేశాం’ అని నిర్మాత సుధాకర్ చెరుకూరి చెప్పారు.