calender_icon.png 21 December, 2025 | 7:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛాంపియన్‌లో ప్రతి పాత్రకూ ప్రారంభం.. ముగింపు ఉంటుంది

21-12-2025 12:14:03 AM

స్వప్న సినిమాస్ అప్ కమింగ్ మూవీ ’ఛాంపియన్’. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో రోషన్ విలేకరులతో సినిమా విశేషాలు పంచుకున్నారు. 

1948లో జరిగే కథ ఇది.. యాక్షన్ డ్రామా వార్ అన్ని చాలా గొప్పగా ఉంటాయి. చరిత్రలో బైరాన్‌పల్లి గురించి చాలామందికి తెలుసు. అందులో మైఖేల్ అనే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్‌ను క్రియేట్ చేసి ఈ కథను చెప్తున్నాం. 

ఇండియాకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంకా హైదరాబాద్‌కు స్వాతంత్య్రం రాని రోజుల్లో జరిగే కథ ఇది. మా డైరెక్టర్ అన్ని రిఫరెన్సులు ఇచ్చారు. చాలా వర్క్‌షాపులు చేశాం. ఇందులో అద్భుతమైన డ్రామా ఉంది. ప్రతి దానికి ఒక కనెక్షన్ ఉంటుంది. 

యాక్టింగ్ అంటే చాలా హ్యూమన్ ఎమోషన్స్ తెలియాలి. దానికి ఒక మెచ్యూరిటీ కావాలి. ఈ మూడేళ్లలో చాలా ట్రావెల్ చేశాను. చాలా నేర్చుకున్నా. ఈ జర్నీ చాలా హ్యాపీగా జరిగింది. పీటర్ అద్భుతమైన యాక్షన్ డిజైన్ చేశారు. షూటింగ్‌లో నాకు కొన్ని గాయాలయ్యాయి. యాక్షన్ సినిమా అంటే ఇలాంటివి మామూలే. గాయాల వల్ల కొన్ని రోజులు షూటింగ్ గ్యాప్ వచ్చేది. 

ప్రతి సినిమా డిఫరెంట్‌గా ఉండాలని కోరుకుంటా. ఒకే తరహా సినిమాలు చేసుకుంటూ పోతే బోర్ కొడుతుంది. ఇప్పుడు ప్రేక్షకుల మనస్తత్వం కూడా మారిపోయింది. వారు థియేటర్ రావాలంటే ఒక అనుభూతిని పంచే కథలు చేయాలి. నా ఫేవరెట్ జోనర్ యాక్షన్. నేను ఫస్ట్ క్రికెటర్ అవ్వాలనుకున్నా. నిజానికి మా నాన్న కోరిక కూడా నేను క్రికెటర్ అవ్వాలని. అయితే నాకు సినిమాలపై ఆసక్తి ఏర్పడింది.  రాబోయే సినిమాల గురించి త్వరలోనే అనౌన్స్‌మెంట్ ఉంటుంది. ఈసారి ఎక్కువ గ్యాప్ లేకుండా కనీసం రెండేళ్లకు మూడు సినిమాలు చేయాలని అనుకుంటున్నా. 

హాలీవుడ్‌లో స్పైడర్ మాన్ లాంటి సినిమాలు దాదాపు 3000 కోట్లు పెట్టి తీస్తారు. కానీ అందులో ఒక కొత్త నటుడు ఉంటాడు. ఖర్చు పెట్టేది సినిమా మీద. అంత స్ట్రాంగ్ సబ్జెక్టు ఉంది కాబట్టే అంత పెట్టారు. -ఒత్తిడి ఉంటుంది. నేను దృష్టి పెట్టాల్సింది యాక్టింగ్‌పైనే. నేనొక్కడినే కాదు బైరాన్‌పల్లిలో ప్రతి క్యారెక్టర్‌కూ ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి పాత్రకూ ఒక ప్రారంభం.. ముగింపు ఉంటుంది.  

డైరెక్టర్ -ప్రదీప్‌ది వరంగల్. నేచురల్‌గానే ఆయనకు ఆ ఎమోషన్ వచ్చేస్తుంది. ఆయన ఎంచుకున్న ప్రతి నటీనటులు ఈ కథకు పర్ఫెక్ట్ యాప్ట్. -స్క్రిప్ట్ పరంగా తలదూర్చను. నా క్యారెక్టర్ ఎలా చేయాలి..? ఎలా ఉంటే బావుటుందనేది డైరెక్టర్‌తో చర్చించేవాడిని.  

ఇందులో కనిపించే ప్రతి ఆబ్జెక్ట్‌కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. కార్ కూడా ఒక క్యారెక్టర్. అలాగే గన్స్, బాల్.. ప్రతి వస్తువు కూడా చాలా ఇంపార్టెంట్. నేను స్కూల్లో ఫుట్‌బాల్ ఆడేవాడిని. అది ఇందులో హెల్ప్ అయింది. హీరోకి మోటివేషన్ ఫుట్‌బాల్. హార్స్ రైడింగ్ కూడా చిన్నప్పుడే నేర్చుకున్నా. 

నాకు వచ్చిన స్క్రిప్టులు నాన్న వింటారు కానీ ఫైనల్ నిర్ణయం నాకే వదిలేస్తారు. ఈ సినిమా కథ కూడా ఒక లైన్‌లా విన్నారు. తర్వాత అంతా నా ఇష్టానికే ఇచ్చారు.  

నేను మామూలుగా తెలుగు మాట్లాడతా. అయితే ఈ క్యారెక్టర్ ప్రాపర్ హైదరాబాదీ. ఆ యాస స్పష్టంగా నేర్చుకున్నా. మా డైరెక్టర్ సహాయంతోపాటు వర్క్‌షాప్స్ కూడా చేశాం.