calender_icon.png 5 February, 2026 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తేదీలు మారాయ్!

05-02-2026 01:21:47 AM

వేసవిలో వినోదం పంచేందుకు పలు సినిమాలు రాబోతున్నాయి. ఇప్పటికే పలు సినిమాల విడుదల తేదీలను కూడా ఆయా చిత్రబృందాలు ప్రకటించాయి. అయితే, అనూహ్యంగా తాజాగా కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ మారాయి. ఇందుకు కారణం పవన్‌కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా విడుదల తేదీని ప్రకటించడమేనని తెలుస్తోంది. పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 26న విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది.

ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశిఖన్నా కథానాయికలు. పార్థిబన్ కేఎస్ రవికుమార్, ఎల్‌బీ శ్రీరామ్, రావు రమేశ్, రాంకీ, కేజీఎఫ్ అవినాష్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా, కార్తిక శ్రీనివాస్ ఎడిటర్‌గా, ఆనంద్ సాయి ఆర్డ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 

‘డెకాయిట్’ మళ్లీ వాయిదా.. 

అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్’. షానీల్ డియో దర్శక త్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. విభిన్న ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. బాలీవుడ్ దర్శక, నటు డు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తొలుత ఈ సినిమాను గత డిసెంబర్‌లో విడుదల చేయాలని భావించారు.

తర్వాత ఉగాది పండుగ సందర్భంలో వినోదం పంచాలనుకొని ఆ తేదీ మార్చి 19కి మార్చారు. ఇప్పుడా తారీఖు కూడా మారిపోయిం ది. తాజా ప్రకటన ప్రకారం.. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఇటీవలే షూటింగ్ పూర్త యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూ ర్తికాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.