01-05-2025 01:46:50 AM
ఎంపీ డీకే అరుణ
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): జనగణనలో కులగణన చేప ట్టాలనే నిర్ణయం ముమ్మాటికీ కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఘనతేనని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. కాంగ్రెస్ గొప్పలు చెప్పుకోవడం ఆపాలని చురకలంటించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తప్పుల తడకలు.. తేలని లెక్కలు.. ఇవేనా మీ ఘనతలంటూ రేవంత్ పాలనపై ధ్వజమెత్తారు. దేశంలో జనగణన, కులగణనను చేపట్టాలన్న ప్రధాని మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.