calender_icon.png 1 May, 2025 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనతో బీసీలకు న్యాయం

01-05-2025 01:44:53 AM

ఎంపీ ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): జన గణనతో పాటు కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణ య్య స్వాగతించారు. ఎన్నో ఏళ్లుగా దేశంలోని బీసీలంతా ఎదురుచూసింది ఈ రోజు కోసమేనని తెలిపారు. చారిత్రాత్మకమైన నిర్ణయం వెనుక కీలక పాత్ర పోషించిన ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

కుల గణన తర్వాత బీసీలకు చట్టసభల్లో 50 శా తం రిజర్వేషన్లు, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, జనాభా ప్రకారం వి ద్య, ఉద్యోగ రిజర్వేషన్ల పెంపు వంటి నిర్ణయాలు తీసుకుంటారని ఆశాభా వం వ్యక్తం చేశారు. జనగణనలో కుల గణన డిమాండ్ చేస్తూ గతంలో సు ప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్. కృష్ణయ్య ఒక ప్రకటనలతో తెలిపారు.