20-12-2025 12:00:00 AM
రూపాయి విలువ మరింత క్షీణించడం భారత ఆర్థిక వ్యవస్థకు మరో పెద్ద సవాల్‌గా మారింది. నిత్య జీవితంలో ప్రతి కుటుం బం ఎదుర్కొనే ఆర్థిక ఒత్తిడికి.. ఇంధన ధరలు పెరగడం, విదేశాల్లో చదువుకునే విద్యార్థుల ఖర్చులు భారీగా పెరగడం, దిగుమతి వస్తువుల ధరలు పెరుగుదలను సూచిస్తోంది. అమెరికా సుంకాల పెంపు, విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోవడం రూపాయిని బలమైన దెబ్బ తీశాయి. విదేశీ పెట్టుబడిదారులు రూ. 1.48 లక్షల కోట్ల షేర్లు అమ్మి బయటకు వెళ్లడంతో మార్కెట్ కూడా కుదేలైంది.
ఈ సంక్షోభాన్ని తాత్కాలిక చర్యలతో ఆపలేం. ఆర్బీఐ ఇప్ప టికే 30 బిలియన్ డాలర్లను అమ్మి రూపాయిని నిలబెడుతుంది. కానీ ఇది తాత్కాలికమే. ఎగుమతులు పెరగాలి, దిగుమతులు తగ్గాలి. ‘మేక్ ఇన్ ఇండియా’ను బలోపేతం చేయాలి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం పూర్తి అయితే మళ్లీ మార్కెట్ అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి.
బడ్జెట్ లోటును అదుపులో పెట్టి పెట్టుబడిదారుల నమ్మకాన్ని తిరిగి తెచ్చుకోవాలి. ఇవన్నీ సమన్వయంతో జరిగితే రూపాయి మళ్లీ ఫుంజుకునే అవకాశాలున్నాయి. రూపాయి క్షీణత ఒక విధంగా గట్టి హెచ్చరిక లాంటిది. స్పష్టమైన చర్యలతో రూపాయిని నిలబెట్టి దేశ భవిష్యత్తును రక్షించాల్సిన అవసరముంది.
శ్రీనివాస్ గౌడ్, జనగాం