calender_icon.png 22 December, 2025 | 6:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమన్యాయం కోసం ఉద్యమిద్దాం!

19-12-2025 12:00:00 AM

పాపని నాగరాజు :

తెలంగాణలో వెనుకబడిన తరగ తులు (బీసీలు) సంఖ్యాబలం కలిగిన శక్తి వంతులు. లక్షలాది హృదయాలు, కష్టజీవుల ఆశలు, భవిష్యత్తు ఇవ న్నీ బీసీ సముదాయంలో ఉన్నాయి. కానీ, ఈ శక్తి రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయాన్ని ఎందుకు సాధించలేక పో తోందనేది ఆలోచించాలి. కుల వివక్ష, అస మానతలు, ఆధిపత్య కులాల ఆధిక్యం బీసీ లను వెనక్కి నెట్టేస్తున్నాయి. ఇలాంటి సమయంలో, బీసీలు తమ భవిష్యత్తును ఎలా రూపుదిద్దుకోవాలి? ఈ సమయం లో ఆలోచనాత్మకంగా, పోరాట ఉత్సాహం తో, త్యాగ భావనను రేకెత్తించే శైలిని అను సరించాలి.

ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో వార్డులను 150 నుంచి 300కు పెంచుతున్నామని ప్ర భుత్వం ప్రకటించిన తీరు, పైకి ప్రజా స్వామ్య విస్తరణగా కనిపించినా, లోతుగా చూస్తే అది రాజకీయ అధికారాన్ని తిరిగి పంచుకునే కుట్ర కోణంలా కనిపిస్తోంది. ఇది పరిపాలనా సంస్కరణ కాదు. ఇది అధిపత్య కుల రాజకీయాలకు కొత్త మ్యాప్ గీసే ప్రయత్నం.

వార్డు విభజన అనేది సంఖ్యల ఆట కాదు. అది ఎవరు గెలవాలి, ఎవరు ఓడిపోవాలి, ఎవరు రాజకీయంగా ఎదగాలి, ఎవరు శాశ్వతంగా పక్కకు నెట్ట బడాలి అన్నది నిర్ణయించే ప్రమాదకర ఆ యుధం. అలాంటి ఆయుధాన్ని శాస్త్రీయ ప్రమాణాలు, జనాభా నిష్పత్తి, సామాజిక న్యాయం పక్కనబెట్టి వాడితే- అది ప్రజా స్వామ్య నేరంగా పరిగణించాల్సి వస్తుంది.

ప్రమాదంలో పడినట్లే!

ప్రస్తుతం జరుగుతున్న విభజనపై కార్పొరేషన్ సమావేశాల్లో వెల్లువెత్తుతున్న ఆవేదన యాదృచ్ఛికం కాదు. ఇది దళిత- బహుజన వర్గాల్లో, ముఖ్యంగా మూడో తరం రాజకీయ నాయకత్వం ఎదగకుండా అడ్డుకునే వ్యూహంపై కలిగిన న్యాయమైన భయం. రెడ్డి, వెలమ, ఆంధ్ర సెటిలర్లుగా గుర్తింపు పొందిన కమ్మ, కాపు కులాలకు రాజకీయ అధికారాన్ని కట్టబెట్టేలా గీతలు గీస్తున్నారన్న అనుమానం బలంగా ఉంది. 300 వార్డుల విభజనలో రిజర్వేషన్ల ప్రశ్న అత్యంత కీలకమైనది.

కానీ ఇక్కడే ప్రభుత్వ అసలు ముఖం బయటపడే ప్రమాదం ఉంది. ఎస్సీ, ఎస్టీలకు 22.5 శాతం రిజర్వే షన్లను యాంత్రికంగా కొనసాగిస్తూ, బీసీ లకు మాత్రం జనాభాకు అసమానంగా 23 శాతం వరకే పరిమితం చేసిన చరిత్ర కళ్ల ముందుంది. అదే సమయంలో ము స్లింలకు కేటాయించిన సీట్లను బీసీ కోటా లో చూపించడం ద్వారా.. నష్టం, మోసం బీసీలకే జరిగినట్లయింది. మైనార్టీలకు వారి జనాభాకు తగిన ప్రాతినిధ్యం దక్కిం దా అనేది ఇక్కడ ప్రశ్న కాదు.

కానీ దానికి ధర చెల్లించింది మాత్రం బీసీలే. ఈ అస మానతను సరిచేయకుండా, ఇప్పుడు కొత్త వార్డుల పేరుతో అదే ద్రోహాన్ని మళ్లీ పున రావృతం చేయబోతున్నారా అన్న సందే హం కలుగుతుంది. వార్డు విభజన తర్వాత రెడ్డి, వెలమ, కమ్మ, కాపు కులాలకు ఇవ్వా ల్సినదానికంటే ఎక్కువే దక్కే అవకాశం ఉందన్న అంచనా రాజకీయ వాస్తవాల మీద ఆధారపడింది.

కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ ప్రా తినిధ్యం అంటూ చేసిన బోగస్ హామీలు చివరకు 17.5 శాతానికే కుదించుకుపో వడం ద్రోహం కిందకే వస్తుంది. అదే స్క్రి ప్ట్‌ను ఇప్పుడు జీహెచ్‌ఎంసీలోనూ తిరిగి రాయబడితే మాత్రం- బీసీల రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడినట్లే!

బలోపేతం అవసరం!

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును గవర్నర్ దగ్గరకు రాష్ర్ట ప్రభుత్వం పం పింది. అయితే ఈ బిల్లుకు సంబంధించి హైకోర్టులో రెండు కౌంటర్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఒకటి, స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు 50శాతానికి మిం చడం రాజ్యాంగ విరుద్ధం అని. రెండోది, బీసీల్లోని అట్టడుగు సంచార జాతుల కులాల మధ్య వర్గీకరణ జరగకుండా ఈ బిల్లును అమలు కాకూడదని. దీంతో రాష్ర్టంలో బీసీ బిల్లు రాజకీయం తీవ్ర అల జడికి దారితీసింది.

50శాతం రిజర్వేషన్లు మించకుండా ‘స్థానిక’ ఎన్నికలు నిర్వ హించుకోవచ్చని హైకోర్టు మధ్యంతర ఉత్త ర్వులు ఇచ్చింది. ఇదే అంశాన్ని సుప్రీం కూడా సమర్థిస్తూ, హైకోర్టు ఉత్తర్వులపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఇప్పుడు ఉమ్మడిగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే బీసీల్లో ఆర్థికంగా ఎదిగిన కులాలే లబ్ధి పొందుతాయి. మిగతా పేద బీసీ కు లాలకు నష్టం జరుగుతుంది. కాబట్టి జీవో 9ని నిలిపివేసి, బీసీ వర్గీకరణతో కొత్త జీవో ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయా కులాల వారు ఈసీకి నివేదించారు.

గతంలో బీఆర్‌ఎస్ చేసిన సర్వే ప్రధానంగా కులాల మధ్య విభజన రేఖను గీసి రాజకీ యంగా లబ్ధి పొందాలనే ఉద్దేశ్యంతో చేసింది. అందుకే బీసీల రిజర్వేషన్ల బిల్లును పట్టించుకోలేదు. తాజాగా కాంగ్రెస్ ప్రభు త్వం కూడా రాష్ట్రంలో ఉన్న అగ్ర కులాల నుంచి విమర్శలు వస్తాయన్న భయంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నట్లుగా నటించిదా అన్న అను మానం కలుగుతుంది.

అయితే బీసీ వర్గీక రణ జరగకపోతే ప్రస్తుత ‘ఓబీసీ రిజ ర్వేష న్ ఫ్రేమ్‌వర్క్’తో సామాజిక న్యాయం కం టే సామాజిక అన్యాయం జరిగే ప్రమాద మే ఎక్కువగా ఉంది.  బీసీల భవిష్యత్తు సవాళ్లతో నిండినది, కానీ అది దీపం. రాజ కీయ ఐక్యత, ఆర్థిక బలం, సామాజిక గౌర వం, ఈ లక్ష్యాలను సాధించడానికి, బీసీలు ఒక విప్లవ అగ్రకుల పాలకుల పార్టీల దారి ని వీడి స్వతంత్ర ప్రత్యామ్నాయ దారిని అనుసరించాలి.

అది రాజకీయంగా, బీసీ లు స్వతంత్ర శక్తిగా ఎదగడం ద్వారానే సాధ్యం. గ్రామీణ స్థాయి నుంచి రాష్ర్ట స్థా యి వరకు నాయకత్వాన్ని పెంచడం అవస రం. విద్య ఒక ఆయుధం. బీసీ యువత ఆధునిక విద్య, నెపుణ్యాలను సొంతం చేసుకోవాలి. నాయకత్వం గ్రామీణ, పట్టణ స్థాయిలో బలోపేతం కావాలి. ఈ పోరా టం కోసం, బీసీలు తమ సౌలభ్యాన్ని త్యా గం చేసి, సమాజం కోసం పోరాడాలి. ఇది ఒక విప్లవ జెండా. ప్రతి బీసీ వ్యక్తి ఈ ఉద్య మంలో భాగమై, సమాజంలో తమ స్థానాన్ని సాధించాల్సిన అవసరముంది.

హక్కుల సాధనకై..

ఇప్పటివరకు బీసీలు జనరల్ స్థానాల్లో పోటీ చేసినప్పటికీ.. మెజారిటీ స్థానాల్లో గెలవగలిగారు. అది వారి సామాజిక శక్తికి నిదర్శనం. కానీ ఆ అవకాశాలనే వ్యవ స్థాపకంగా మూసివేయాలనే ప్రయత్నమే ఈ వార్డు విభజన. ‘మీరు గెలుస్తున్నారు కదా, రిజర్వేషన్లు ఎందుకు?’ అన్న వాదన వెనుక దాగిన ఉద్దేశం ఇదే. పోటీని ని యంత్రించడం, గెలుపును పరిమితం చేయడం. ఈ పరిస్థితిలో ‘ఇప్పుడేమీ జరగ దు’ అన్న నిర్లక్ష్యం బీసీలకు ప్రాణాంతకం.

రాజకీయంగా అప్రమత్తంగా లేకపోతే, ఈ నగరంలో బీసీలు నాయకులుగా గాక ఓట ర్లుగానే మిగిలిపోతారు. కాబట్టి బీసీల ఉద్యమం తప్పనిసరి అనేది మాటలకే పరి మితం కాకూడదు. ఇకపై బీసీలు ప్రెస్‌మీ ట్‌లకే, ఇందిరాపార్క్ ధర్నాలకే పరి మితం కావడం సరికాదు. 300 వార్డుల్లో కనీసం సగం సీట్లకు న్యాయమైన ప్రాతి నిధ్యం కో సం ఉద్యమించాలి. అది వార్డు స్థాయిలో జరగాలి. ప్రతి గీతను ప్రశ్నించాలి.

ప్రతి మ్యాప్‌ను బహిర్గతం చేయాలి. ఈ రోజు ఆవార్టులలో అన్యాయం జరిగిందని రాజ కీయ పార్టీలు ఎలా రోడ్లెక్కాయో అదే తీవ్రతతో, అదే పట్టుదలతో బీసీలు తమ హక్కుల కోసం నిలదీయాలి. ఎందుకంటే ఇది సీట్ల పోరు కాదు, రాజకీయ ఉనికికి సంబంధించిన పోరు. ఆయా పార్టీలలో ఉన్న బీసీల కర్తవ్యం కూడా అదే.

ఈ వార్డు విభజన ప్రజా స్వామ్యాన్ని బలోపేతం చేస్తుందా? లేక ఆధిపత్య కులాల అధికా రాన్ని మరోసారి పునర్వ్యవస్థాపన చే స్తుందా అనే ప్రశ్నకు ప్రభుత్వం సమా ధానం చెప్పాల్సిందే. అంతకంటే ముందు ముఖ్యంగా బీసీలు జరుగుతున్న దారుణా లను గుర్తించి అప్రమత్తంగా వ్యవహ రించాలి. ఎందు కంటే, మౌనం ఎప్పుడూ తటస్థం కాదు. ఇలాంటి సమయంలో మ న మౌనం కూడా ద్రోహమే అవుతుంది.

 వ్యాసకర్త సెల్: 9948872190