calender_icon.png 22 December, 2025 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వమే నేరుగా జీతాలివ్వాలి!

20-12-2025 12:00:00 AM

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనైనా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ జీవితాలు మారుతాయేమోనని ఆశపడ్డారు. కానీ, వారి బతుకుల్లో ఎటువంటి మార్పు రాలేదు. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మొదటి తేదీన జీతాలు ఇస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇస్తూ ఉద్యోగ భద్రతను కల్పించారు ఇచ్చారు. కానీ తెలంగాణలో ఏజెన్సీ వ్యవస్థని రద్దు చేయలేదు.

ఈ ఏజెన్సీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు అందిస్తే బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు చేరవేయడంలో వీరిదే ప్రధాన పాత్ర. ఉద్యోగస్తుల శ్రమని గుర్తించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి అందరికీ శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వాలి. తమ రెగ్యులరైజేషన్ కోసం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరముంది.

సమాన పనికి సమాన వేతనం అనే హక్కును జగ్జీత్ సింగ్ కేసు (2016)లో సుప్రీంకోర్టు మరింత బలపరిచింది. తాత్కాలిక ఉద్యోగులకు కూడా రెగ్యులర్ ఉద్యోగులకిచ్చే వేతనాలే ఇవ్వాల్సి ఉంటుందని తీర్పు ఇచ్చింది. అయితే ఔట్ సోర్సింగ్ ఉద్యో గులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానమైన రక్షణను ప్రభుత్వాలు కల్పించటం లేదు. గత ఏడెనిమిది నెలలుగా ఏజెన్సీలు వేతనాలు ఇవ్వకపో వడంతో ఔట్ సోర్సింగ్ సిబ్బంది అప్పులు చేయాల్సి వస్తున్నది.

నెల తిరిగేసరికే పిల్లల ఫీజులు, ఇతర ఖర్చుల నేపథ్యంలో కుటుంబ పోషణ భారంగా మారిపోయింది. ఇప్పటికైనా ప్రభ్యుతా లు ఏజెన్సీలను రద్దుచేసి అందరినీ ఒకే కార్పొరేషన్ కిందకు తీసుకొచ్చి సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. 

 పులి లక్ష్మయ్య, కరీంనగర్