25 August, 2026 | 1:41 AM

ఒకే కుటుంబంలో నలుగురి మృతి

25-08-2026 12:00 AM

బాధిత కుటుంబాలకు విప్ ఆది శ్రీనివాస్ భరోసా

వేములవాడ, ఆగస్ట్ 24, (విజయ క్రాంతి): చందుర్తి మండలం లింగంపేట గ్రా మ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చిం ది. మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సోమవారం వేములవాడ ఏరియా ఆ సుపత్రిలో పరామర్శించి ఓదార్చారు. మృతదేహాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యుల కు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రుద్రంగి మండల కేంద్రానికి చెందిన షాదుల్లా కు టుంబం వివాహ వేడుకకు వెళ్తుండగా శనివారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో షాదుల్లా, ఆయన భార్య హా సీనా, మరో హాసీనా, పదో తరగతి చదువుతున్న బాలిక మృతి చెందారు. ప్రమాదం అనంతరం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విష మించడంతో ఒక్కొక్కరుగా మృతి చెందినట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు.

ప్రభుత్వం అండగా ఉంటుంది

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రక్తసంబంధీకులను కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆది శ్రీనివాస్ అన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయాన్ని అందించేం దుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసా దించాలని భగవంతుడిని ప్రార్థించారు.

భద్రతే ముఖ్యం

రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని విప్ సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ముందు, వెనుక సీట్లలో ప్రయాణించే వారు సీట్బెల్ట్ ధరించాలని కోరారు. అతివేగాన్ని నివారించి రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.

ప్రయాణికుల భద్రతపై అవగాహన కల్పించేందుకు పోలీసుశాఖ ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ఇంటి నుంచి బయలుదేరిన ప్రతి ఒక్కరి కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తుంటారనే విషయాన్ని గుర్తుంచుకుని సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతను బాధ్యతగా తీసుకోవాలని ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.