calender_icon.png 7 October, 2025 | 12:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోల్డ్రిఫ్ సిరప్ వినియోగం నిలిపివేయండి

07-10-2025 12:00:00 AM

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనిత

మంచిర్యాల, అక్టోబర్ 6 (విజయక్రాంతి): జిల్లాలో చిన్న పిల్లలలో దగ్గును నియంత్రించేందుకు వినియోగించే కోల్డ్రిఫ్  సిరప్ వాడ కాన్ని వెంటనే నిలిపివేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనిత సోమ వారం తెలిపారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డి.జి. హెచ్. ఎస్.), తెలంగాణ రాష్ట్ర వైద్య-ఆరోగ్యశాఖ డైరెక్టర్ మార్గదర్శకాల ప్రకారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో కోల్డ్ రిలిఫ్  సిరప్ వినియోగించడం వెంటనే ఆపాలని, సిరప్ సంబంధిత నిల్వలు జిల్లాలో అందుబాటులో లేవని, జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు, ఫార్మాసిస్టులు, ఏజెన్సీలు తమ వద్ద సిరప్ నిల్వలు ఉన్నట్లయితే వెంటే సమాచారం అందించాలని తెలిపారు.

తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందిన శ్రేసన్ ఫార్మా మే 2025 నెలలో తయారు చేసిన బ్యాచ్ నం.ఎస్‌ఆర్-13 నుంచి వచ్చిన కోల్డ్రిఫ్  సిరప్ వినియోగించడం వలన చిన్న పిల్లలలో అనారోగ్య సమస్యలు రావడంతో ఈ మందు నిషేధించడం జరిగిందని, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో అనేక మంది పిల్లల మరణానికి కోల్డ్రిఫ్ సిరప్ వినియోగంతో సంబంధం ఉండటంతో ఈ చర్య లు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

జిల్లా లో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకా రం నమోదు చేసుకున్న అన్ని ఆసుపత్రులు, ఫార్మసీ కేంద్రాలు, చిన్నపిల్లల వైద్యులు, ప్రైవేట్ వైద్యుల వద్ద కోల్డ్ రిలిఫ్  సిరప్‌లు ఉండరాదని, సిరప్ నిల్వలు కలిగి ఉన్నవా రు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో లేదా టోల్ ఫ్రీ (18005996969)లో వివరాలు అందించాలని తెలిపారు. జిల్లాలోని ప్రభావిత బ్యాచ్ సిరప్ నిల్వలను గుర్తించి, నిలిపివేయడానికి ఫార్మసీలు, హోల్ సేల్ వ్యాపారులు, ఆసుపత్రులను అప్రమత్తం  చేస్తున్నామన్నారు.

జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు తమ పరిధిలోని గ్రామాలలో ఉన్న ఫార్మసీల వద్ద ఉన్న సిరప్‌ల వివరాలు తీసుకోవాలని తెలిపారు. రెండేళ్ల వయస్సు లోపు గల పిల్లలకు ఎలాంటి దగ్గు మందుల వినియోగానికి వైద్యులు సూచించరాదని, తల్లిదం డ్రులు పిల్లల వైద్య నిపుణుల సూచన ద్వారా మాత్రమే మందులను వినియోగించాలని, ఫార్మాసిస్టులు, డ్రగ్గిస్ట్ లు వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించరాదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకో వడం జరుగుతుందని హెచ్చరించారు.