25 August, 2026 | 1:12 AM

కాంగ్రెస్‌తోనే పేదల సొంతింటి కల సాధ్యం

25-08-2026 12:00 AM

సింగంపల్లిలో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కసిరెడ్డి 

ఆమనగల్లు, ఆగస్టు 24 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరుతుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం ఆమనగల్లు మండలం సింగంపల్లి గ్రామంలో ల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన కటికర్ల నిర్మల, బండారి స్వప్న,రోజా ల ఇండ్లు పూర్తి కావడంతో వారు గృహప్రవేశం చేశారు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరై లబ్ధిదారులను సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నియోజకవర్గంలో ఇల్లు లేని చివరిలబ్ధిదారునికి కూడా గృహం అందే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం నిరుపేదలకు 100% సబ్సిడీతో రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వివరించారు.

సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 15న రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తారని తెలిపారు.ఈ విడత నుంచి హైదరాబాద్తో పాటు ఇతర పట్టణ ప్రాంతాల పేదలకు కూడా ఇళ్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. అంతకుముందు సింగంపల్లి గ్రామంలో ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

కార్యక్రమంలో సర్పంచ్ సత్యం, ఉప సర్పంచ్,రవీంద్ర, పంచాయితీ సెక్రటరీ కాటమయ్య,మండల పార్టీ అధ్యక్షుడు ఆదివాసి రాష్ట్ర నాయకుడు కృష్ణ నాయక్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎంగలి ప్రసాద్, నాయకులు వెంకట్ రెడ్డి, పర్వతాలు, వగ్గు మహేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వస్పుల శ్రీకాంత్, ఎన్‌ఎస్‌ఈయూఐ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఫరీద్, హీరా సింగ్, గ్రామస్తులు బండారి సత్తయ్య, చింతకింది కృష్ణయ్య, ఆమనగంటి నర్సింహ, బోడిగల రాంబాబు, ఆమనగంటి నరేందర్, కాటమోని రామకృష్ణ, డేరంగుల రాజు, కొండల్ రెడ్డి, రాఘవేందర్, దేవరశెట్టి మహేష్, నాజర్ తదితరులు పాల్గొన్నారు.