22-11-2025 12:00:00 AM
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
శంకర్ పల్లి, నవంబర్ 21: శుక్రవారం నవాబ్ మండలం అక్నాపూర్ గ్రామ వాసి, ఊరడి భాగ్యమ్మ బంద్యయ్య శంకర్ పల్లిమునిసిపాలిటి పరిధిలోని 2వ వార్డు నారెగూడెం మీన శ్రీశైలం కి ప్రభుత్వం తరుపున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడంతో వారు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.