మంచినీటి సమస్యను పరిష్కరించాలి
20-08-2026 12:26 AM
అబ్దుల్లాపూర్‌మెట్, ఆగస్టు 19: పసుమాములలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు బుధవారం డీసీ సంపత్ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పెద్దఅంబర్‌పేట డివిజన్‌లోని పసుమాముల వివేకానందనగర్ కాలనీలో మంచినీటి సమస్య ఉందని డీసీకి వివరించారు. కాలనీకి వచ్చే మంచినీటి పైపులైన్ ప్రధాన రోడ్డుపై పగిలి 15 రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తమ సమస్యను వాటర్ వరక్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు రాజు గౌడ్, లక్ష్మణ్, రవీందర్, నర్సింహా, చాంద్ పాషా తదితరులు ఉన్నారు.






