27 August, 2026 | 4:41 AM

ప్రిన్సిపాల్ డీపీసీపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వాలి

27-08-2026 12:08 AM

1998 బ్యాచ్ క్వాలిఫైడ్ జేఎల్‌లకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్

ముషీరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): ఈ నెల 31వ తేదీన ప్రిన్సిపల్ పోస్టుల డీపీసీ నిర్వహిస్తారా లేదా అనే అంశంపై విద్యాశాఖ వెంటనే స్పష్టత ఇవ్వాలని క్వాలిఫైడ్ గవర్నమెంట్ డిగ్రీ  లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ టి.ఎస్ ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి. బాలయ్యలు డిమాండ్ చేశారు. బుధవారం వారు ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అర్హత కలిగిన1998 బ్యాచ్ క్వాలిఫైడ్ జూనియర్ లెక్చరర్లు డిమాండ్ చేశారు.

2025 నుంచి ప్రిన్సిపల్ ప్రమోషన్లు నిలిచిపోయాయని, దీంతో అనేక మంది ఉద్యోగులు ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. రిటైర్మెంట్కు చేరువలో ఉన్న అర్హులైన జూనియర్ లెక్చరర్లకు అవకాశం కల్పించాల్సిన బాధ్యత విద్యాశాఖపై ఉందన్నారు. ప్రమోషన్ ఉద్యోగి హక్కు కాదా అని ప్రశ్నించారు. 

చదువుకొని అర్హత సాధించడం నేరమా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ అర్హతలపై చర్యలు తీసుకోవడంతో పాటు నిజమైన అర్హత కలిగిన వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ కార్యదర్శి,  కమిషనర్ ప్రజలకు, ఉద్యోగులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నెల 31న డీపీసీ నిర్వహణపై తక్షణమే అధికారిక ప్రకటన విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.