calender_icon.png 30 May, 2025 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరాటేతో ఆత్మరక్షణ.. ధైర్యసాహసాలు అలవడుతాయి..

28-05-2025 10:28:00 PM

కరాటేలో రాణించి కోదాడకు పేరు తేవాల..

కరాటేలో రాణించేందుకు స్టూడెంట్ కొఫోఖాన్ కరాటే క్లబ్ చేస్తున్న కృషి అభినందనీయం.. ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం

కోదాడ: కోదాడ కోఫోఖాన్ కరాటే క్లబ్ సమ్మర్ క్యాంపుకు భారీ స్పందన... కరాటేతో ఆత్మ రక్షణతో పాటు ధైర్యసహసాలు, క్రమశిక్షణ అలవాడతాయని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం(Kodad Traffic SI Mallesham) అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని పెరిక హాస్టల్ భవన్ ఆవరణలో స్టూడెంట్ కోఫో ఖాన్ కరాటే క్లబ్ కోదాడ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ ముగింపులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. 

విద్యార్థులు మంచి పౌరులుగా ఎదిగేందుకు కరాటే దోహదపడుతుందన్నారు. కరాటేతో శారీరక దృఢత్వం మానసిక బలం పెరుగుతాయన్నారు. కోదాడ విద్యార్థులు కరాటేలో రాణించి పేరు తేవాలన్నారు. కోదాడ విద్యార్థులు కరాటేలో రాణించేందుకు కోఫోఖాన్ కరాటే క్లబ్ నిర్వాహకులు మాధవి లత చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం సమ్మర్ క్యాంపు పూర్తి చేసుకున్న విద్యార్థినీ విద్యార్థులకు నిర్వహించిన బెల్ట్ గ్రేడింగ్ టెస్టులో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్ లు అందజేసారు. ఈ కార్యక్రమంలో కోచ్ మాధవి లత, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉన్నారు.