09-01-2026 12:00:00 AM
ఖర్చు కోసం ఖజనా అరువు ..?
అరువు పుట్టకపోతే పరిస్థితి ఏందీ..?
వనపర్తి, జనవరి 8 (విజయక్రాంతి): మున్సిపాలిటీ ఎన్నికలకు సంబందించిన నోటిఫికేషన్ రాకముందే మున్సిపాలిటీ పరిధిలో ఆయా వార్డు లో ఎన్నికల వేడి మొదలయింది. ఇప్పటికే ఆయా వార్డులో ఫోటీలో ఉన్న నాయకుల జేబులకు చిల్లులు పడుతున్నప్పటికి గెలవాలంటే ఖర్చులు తప్పదని వారికీ వారే సర్ది చెప్పుకుంటున్నప్పటికీ బయటకు మాత్రం ఘంభీరంగా కనిపిస్తున్నారు. జనవరి చివరి నాటికీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి ప్రమాణ స్వీకారం సైతం జరుగుతుందన్న ప్రచారాలు సోషల్ మీడియా చక్కర్లు కొడుతుండడంతో వార్డులో ఆశావాహులు అంతర్గత సమావేశాలు ఉపందుకున్నాయి. వారికీ ఎంత పని ఉన్నప్పటికీ విడిచిపెట్టుకుని వార్డులో గల ముఖ్యుల ఇంటి చుట్టుపక్కలకు వెళ్లి పలకరింపులు ఫోన్ చేసిన వెంటనే వాలిపోయే వంటి వాటిలో ఆయా వార్డుల్లో ఫోటి చేసే ఆశావాహుల రోజువారీ దినచర్యగా మారింది.
ముఖ్యులకు బెల్ట్ షాప్‌లో మందు మా ఖాతాలో..?
మున్సిపాలిటీ ఎన్నికల్లో ఫోటి చేయాలనుకున్న ఆశావాహుల పరిస్థితి ముందర పోతే నొయ్యి వెనకకుపోతే గొయ్యి అన్న చందంగా మారిందని చెప్పవచ్చు. ఎవరు చెబితే ఓట్లు అధికంగా పడుతాయో అటువంటి ముఖ్యులకు గెలవాలంటే ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఆశావహులకు ఏర్పడింది. అలాంటి ముఖ్యులను దూరం చేసుకుంటే ఎక్కడ ఓడిపోతామో అన్న భయం తో వారి కోసం ఆయా వార్డులో గల బెల్ట్ షాప్ లో ప్రత్యేక ఖాతాలను సైతం ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. వాళ్లు ఎప్పుడు వెళ్లిన ముఖ్యులు అడిగిన మందును ఇచ్చి ఆశావాహుల ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిసింది. ఆశావాహుల ఖాతాలో ఎవరికీ పడితే వాళ్లకు మందు ఇవ్వవద్దని తాము చెబితేనే ఇవ్వాలని ఆశావాహుల బెల్ట్ షాప్ ల నిర్వహకులకు చెబుతున్నట్లు సమాచారం.
ఖర్చు కోసం ఖజనా అరువు..?
మున్సిపాలిటీ ఎన్నికల్లో నిలబడి గెలుపొందాలంటే ప్రస్తుతం లక్షల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తమ దగ్గర గల నగదు తో పాటు ప్రత్యర్థి కంటే ఎక్కువ ఖర్చు చేస్తేనే గెలుస్తామన్న ఆశతో ఎన్నికలలో ఖర్చు పెట్టేందుకు ఫోటీలో నిలుచునే ఆశావాహులు ఇప్పటికే అరువు ( అప్పు ) కోసం ప్రయత్నాలు చేసుకుని రెడీగా ఉన్నారు. నోటిఫికేషన్ పడిన వెంటనే తెచ్చిన అరువుతో ఎన్నికల్లో గెలుపొందాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జోరుగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది
అరువు పుట్టకపోతే పరిస్థితి ఏందీ...?
మున్సిపాలిటీ ఎన్నికల్లో తాము సైతం ఫోటీలో ఉన్నామంటూ గడిచిన సంవత్సరం నుండి లెక్కకు మించిన ఖర్చు లు ఆశావాహులు చేస్తు వచ్చారు. ఎన్నికలు వచ్చే సమయంలో డబ్బులకు ఇబ్బందులు కాకుండా అరువులను సైతం అడిగి పెట్టుకున్నారు. కాగా అరువు అడిగిన వాళ్లు సకాలంలో అరువు ఇయ్యక పోతే తమ పరిస్థితి ఏంటింది అన్న ఆలోచన లో మునిగి తెలుతున్నప్పటికి బయటకు మాత్రం మనం ఎం భయపడాల్సిన అవసరం లేదు అంత సెట్ చేసుకున్నామంటూ అటు ముఖ్యులకు ఇటు నేతలకు చెప్పుకుంటున్నట్లు సమాచారం