09-01-2026 12:00:00 AM
అభివృద్ధి పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్
సికింద్రాబాద్ జనవరి 8 (విజయ క్రాంతి) : హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల ను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం సందర్శించారు. హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల చెంత పతంగుల పండుగను పెద్దఎత్తున నిర్వహించాలని ప్రభుత్యం నిర్ణయించిన నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. కూకట్‌పల్లి నల్లచెరువుతో పాటు మాదాపూర్లోని తమ్మిడికుంట, పాతబస్తీలోని బమ్-రుక్న్ ఉద్ దౌలా చెరువులను సందర్శించారు.మూడు నాలుగు రోజుల్లో సుందరీకరణ పనులు పూర్తి చేసి వేడుకలకు వేదికలు సిద్ధం చేయాలన్నారు. లైటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు.
మొక్కలను విరివిగా నాటి చెరువులను సుందరీకరించాలని కోరారు. చెరువుల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చెరువుల పరి సరాలు ప్రజలకు ఆకర్షణీయంగా ఉండేలా అభివృద్ధి చేయాలని, నడక మార్గాలు, లైటింగ్, శుభ్రత పనులు, భద్రతా ఏర్పాట్లను వేగవంతం చేయాలని సూచించారు. పండగ నాటికి చెరువులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండేలా పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు..