18-12-2025 12:00:00 AM
ఎన్నికల జిల్లా పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం
నిర్మల్ డిసెంబర్ (17 విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం బుధవారం, జిల్లాలో మూడో విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భైంసా, బాసర, ముధోల్, తానూరు మండలాల్లో ఆయా గ్రామాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఆయా పోలింగ్ కేంద్రాలలో జరుగుతున్న పోలింగ్ సరళిని చూశారు. ఓట్లు వేయడానికి వచ్చిన ఓటర్లకు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయేమో పరిశీలించారు. అధికారులతో మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని పకడ్బందీగా పూర్తి చేయాలని అన్నారు.