18-12-2025 12:00:00 AM
మల్టీ జోన్1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి
కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి): శాంతియుత వాతావరణం లో ఎన్నికలు నిర్వహించేలా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని మల్టీ జోన్-1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం మల్టీ జోన్‌వన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి రెబ్బెన మండలంలోని గోలేటి సింగరేణి కాలరీస్ హై స్కూల్,ఆసిఫాబాద్ మండలంలోని మోతుగూడ ప్రాథ మిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఏ ఎస్ పి చిత్తరంజన్ తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, పోలిం గ్ సిబ్బంది నిర్వహణ, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రశాం త వాతావరణం నెలకొనేలా పోలీస్ సిబ్బం ది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లే దని స్పష్టం చేస్తూ, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డ్యూటీతో పాటు మానవత్వం చూపిన పోలీసులు
మంచిర్యాల, డిసెంబర్ 17 : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలీసులు ఓ వైపు విధులు నిర్వహిస్తూనే మరోవైపు ఓటర్లకు సహాయమందించి మానవత్వాన్ని చాటారు. పోలింగ్ కేంద్రాలకు ఓటు వేయడానికి వచ్చి న వృద్ధులకు సహాయం అందించారు. మం దమర్రి మండలం అందుగులపేట స్కూల్ లో ఏ ఎస్ ఐ మల్లేష్, సారంగపల్లి (తుర్కపల్లి) గ్రామంలో విశ్వనాథ్, కోటపల్లి మం డలం సిర్సాలో స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ నితీన్ లు వృద్ధులను ఎత్తుకొని, వీల్చెయిర్ లతో పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడానికి సహాయపడ్డారు. పోలీసులు డ్యూటీతో పాటు మానవ త్వాన్ని చాటడం ప్రశంసనీయమని అధికారులు అభినందించారు.