ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం
డీఆర్‌సీ సెంటర్ల వద్ద మూడంచెల భద్రత
జూన్ 4న ఓట్ల లెక్కింపు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఈవీఎంలలో అభ్యర్థు ల భవితవ్యం నిక్షిప్తమై ఉంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ ముగిసిన అనంతరం పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలను డీఆర్‌సీ కేంద్రాలకు తరలించారు. హైదరాబాద్ జిల్లాలో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఈవీఎంలు అన్నింటినీ అధికారులు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా డీఆర్‌సీ కేంద్రాల కు తరలించారు. ఇదిలా ఉండగా మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఈవీఎంలను కూడా ప్రత్యేక డీఆర్‌సీ కేంద్రం లో భద్రపర్చారు. జూన్ 4న ఎన్నికల కౌం టింగ్ ఉన్నందున అప్పటి వరకు ఈ కేంద్రా ల వద్ద పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.




