ఆదిలాబాద్.. పోలింగ్ కూల్!
మొరాయించిన ఈవీఎంలు
పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు
కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు
ఆదిలాబాద్, మే 13 (విజయక్రాంతి): ఒకటీఅర స్వల్ప ఘర్షణలు తప్ప సోమవారం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రశాంతంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి కేవలం 12 మంది మాత్రమే బరిలో ఉన్నారు. ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముధోల్, ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పూర్(టీ) అసెంబ్లీ నియోజకవ ర్గాల పరిధిలోని మొత్తం 2,200 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలీసులు మావోయి స్టు ప్రభావిత ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
కేంద్రాల్లో పోలింగ్ సరళిని ఆయా జిల్లాల రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు పరిశీలించారు. ఆదిలాబా ద్, నిర్మల్, ఆసిఫాబాద్ కలెక్టరేట్లలో ఏర్పా టు చేసిన కమాండ్ కంట్రోల్ రూంల నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. ఉదయం 9 గంటలకు 13.22 శా తం, ఒంటి గంటకు 50.18 శాతం, మధ్యా హ్నం 3 గంటలకు 62.44 శాతం, సాయం ఓత్రం 5 గంటల వరకు 69.81 శాతం పోలింగ్ నమోదైంది. 6 గంటలలోపు పోలింగ్ కేం ద్రంలో ఉన్న వారికి అధికారులు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. వృద్ధులు, దివ్యాంగులు మరొకరి సాయంతో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసి తమ చైతన్యాన్ని చాటుకున్నారు.
పటిష్ట బందోబస్తు..
పార్లమెంట్ నియోజకవర్గంలో అధికారులు 256 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 172 మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఆయా కేంద్రాల వద్ద పోలీస్ ఉన్నతాధికారులు స్థానిక పోలీస్ సిబ్బందితోపాటు కేంద్ర బలగాలతో బందబోస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. పుతిలి బౌలి పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది. అలాగే మరోచోట కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది.
మొరాయించిన ఈవీఎంలు
తాంసి మండల కేంద్రంలో ఉదయం పోలింగ్ ప్రారంభమైన తర్వాత ఈవీఎంలు కొద్దిసేపు మొరాయించాయి. దీంతో గంటపాటు పోలింగ్ నిలిచింది. అలాగే పుతిలి బౌలి షాదీఖానా, బలక్ మందిర్ పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం ఈవీఎంలు మొరాయించాయి. టెక్నికల్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సమస్యలను పరిష్కరించడంతో తిరిగి పోలింగ్ ప్రారంభమైంది.
ఐదు గ్రామాల్లో ఎన్నికల బహిష్కరణ
ఇచ్చోడ మండలం బహూజీపేట, బజార్‌హత్నూర్ మండలం మాన్కపూర్ గ్రామస్తులు, దేగాం గ్రామస్తులు తమ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని ఎన్నికలను బహిష్కరించారు. కడెం మండలం అల్లంపల్లి, బాబానాయక్ తండావాసులు రహదారి సౌకర్యం కల్పించాలని నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్, అదనపు కలెక్టర్ కిషోర్‌కుమార్, ఏఎస్పీ సూర్యనారాయణ, రెవెన్యూ, పోలీస్ అధికారులు రంగంలోకి దిగి గ్రామస్తులకు సర్ది చెప్పి వారితో ఓటు వేయించారు.




