13-01-2026 12:00:00 AM
పూర్తిస్థాయిలో సవరణ జరగలేదు బీజేపీ నాయకులు వెంకట్
తాండూరు, 12 జనవరి, (విజయక్రాంతి ): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న 36 వార్డులకు గాను ఓటర్ల తుది జాబితాను విడుదల చేసినట్లు మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, ఇంచార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమేష్, టౌన్ ప్లానింగ్ విభాగము అధికారులు వంశీధర్, నరేష్, ఓ ప్రకటనలో తెలిపారు. గతవారం విడుదల చేసిన ఓటర్ల ముసాయిదా జాబితాలో అనారుల పేర్లు నమోదు అయ్యాయని కాంగ్రెస్, బిజెపి, టిఆర్‌ఎస్, సీపీఎం, ఎంఐఎం పార్టీల నాయకులు మభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు చేశారు.
ఈ మేరకు ఓటర్ల జాబితాను సవరించి తుది జాబితా రూపొందించినట్లు పేర్కొన్నారు . మరోవైపు ఓటర్ల జాబితా పూర్తిస్థాయిలో సవరణ జరగలేదని జాబితాలో ఓటర్ల ఫోటోలు చేర్చాలని అసంపూర్తిగా సవరించాలని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి జుంటుపల్లి వెంకట్ అన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని ఓటర్లతో పాటు తాండూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న గ్రామాల ఓటర్ల పేర్లు మున్సిపల్ జాబితాలో ఉన్నాయని తెలిపారు. పూర్తిస్థాయిలో హోటల్లో జాబితా సవరించాలని ఆయన కోరారు.