calender_icon.png 13 January, 2026 | 8:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రీన్‌ఫీల్డ్ రైతులకు అండగా ఉంటా..

13-01-2026 12:00:00 AM

ఎంపీ మల్లు రవి

కడ్తాల్ జనవరి 12(విజయక్రాంతి): గ్రీన్ఫీల్ హైవే భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేసేందుకు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతుల పక్షాన నిలబడి, వారికి ప్రభుత్వం నుంచి గరిష్ట మద్దతు ధర ఇప్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. సోమవారం గ్రీన్ఫీల్ భూ బాధిత రైతులు ఎంపీ మల్లు రవి కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. రైతుల పరిస్థితిని సావధానంగా విన్న ఎంపీ, వెంటనే సానుకూలంగా స్పందించారు. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు ఆయన తెలిపారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల డిమాండ్లకు అనుగుణంగా ప్రభుత్వం నుండి మెరుగైన పరిహారం అందేలా సీఎం తో చర్చిస్తానని హామీ ని చ్చారు. పరిహారం విషయంలో రైతులు ఎవరూ అధైర్యపడొద్దు.. మనోవేదనకు గురికావద్దు. మీకు అండగా నేను ఉంటాను‘ అని రైతులకు భరోసా కల్పించారు. కార్యక్రమం లో సర్పంచులు ఎక్వాయిపల్లి కర్ణాకర్ గౌడ్, మర్రిపల్లి సర్పంచ్ రవి, వార్డు సభ్యులు దీపక్ కుమార్, మాజీ వార్డు సభ్యులు రవి, యూత్ కాంగ్రెస్ నాయకులు రవి, మరియు ఆన్నేపు హరీష్ తదితరులు పాల్గొన్నారు.