calender_icon.png 28 October, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిలకడగా శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్యం

28-10-2025 01:11:42 AM

-రక్తస్రావంతో ఐసీయూలో చేరిక

-ప్రస్తుతం జనరల్ వార్డుకు మార్పు

-సిడ్నీకి కుటుంబ సభ్యులు

సిడ్నీ, అక్టోబర్ 27: భారత క్రికెట్ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఆరో గ్యం గురించి సోమవారం పలు వార్తలు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేశా యి. సిడ్నీ వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన శ్రేయాస్ కు అంతర్గతంగా రక్తస్రావం కావడంతో ఐసీయూలో చేర్చారు. నిజానికి గాయపడిన రోజే స్కానింగ్‌కు పంపించిన తర్వాత మూడు వారాల రెస్ట్ అవసరమని వైద్యులు సూచించడంతో అందరూ సాధారణ గాయమే అనుకున్నారు. కానీ భారత జట్టు కాన్‌బెర్రాకు బయలుదేరే ముందు శ్రేయాస్ హెల్త్ అప్‌డేట్ వచ్చింది.

క్యాచ్‌ను అందుకునే క్రమంలో గ్రౌండ్‌కు బలంగా గుద్దుకోవడంతో పక్కటెములకు బలంగా గాయమైంది. తర్వాత స్కానింగ్‌లో లోపల బ్లీడింగ్ జరిగినట్టు గుర్తించి ముందు జాగ్రత్తగా ఐసీయూకి తరలించారు. గాయపడిన ప్పుడు కూడా శ్రేయాస్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఐసీయూలో పలు గంటలు అబ్వర్వేషన్‌లో ఉంచిన అనంతరం జనరల్ వార్డు కు షిప్ట్ చేశారు. బీసీసీఐ టీమ్‌కు చెందిన ఒక డాక్టర్ ప్రస్తుతం సిడ్నీలోనే శ్రేయాస్‌తోనే ఉన్నారు. శ్రేయాస్ ఆరోగ్యంపై బీసీసీఐ కూడా అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం శ్రేయాస్ ఆరోగ్యం నిలకడగా ఉం దని, కోలుకుంటున్నట్టు తెలిపింది. బీసీసీఐ మెడికల్ టీమ్‌లోని డాక్టర్ అతని పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించింది. మరో నాలుగైదు రోజుల పాటు సిడ్నీ హాస్పిటల్‌లోనే శ్రేయాస్ ఉంటాడని సమాచారం. అయితే బీసీసీఐ మాత్రం శ్రేయాస్ అయ్యర్‌ను ఐసీయూలో ఉంచిన విషయాన్ని ప్రస్తావించలేదు. ఇదిలా ఉంటే శ్రేయాస్ పరిస్థితితో ఆందోళన చెందిన అతని కుటుంబసభ్యులు అత్యవసర వీసాల కోసం దరఖాస్తు చేసుకుని సిడ్నీకి బయలుదేరారు.

ఇదిలా ఉంటే శ్రేయాస్ కోలుకుం టున్నాడని తెలియడంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అతను త్వరగా కోలుకుని మళ్ళీ గ్రౌండ్‌లో అడుగుపెట్టాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం భారత జట్టు వైస్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ ఎంపికయ్యాడు.