calender_icon.png 2 November, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రకృతి వైపరీత్యాలతో పంటలకు నష్టం జరిగితే మంత్రికి సంబంధమా

01-11-2025 08:48:50 PM

ప్రకృతిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం విడ్డూరం

రైతు ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం పుట్టమధు ఖబర్దార్

మంథనిలో విలేకరుల సమావేశంలో ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్ 

మంథని (విజయక్రాంతి): ప్రకృతి వైపరీత్యాలతో పంటలకు నష్టం జరిగితే మంత్రికి సంబంధమా... ప్రకృతిని అడ్డం పెట్టుకొని పుట్ట మధు రాజకీయం చేయడం విడ్డూరమని మంథనిలో విలేకరుల సమావేశంలో ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్ లు అన్నారు. వ్యవసాయ మార్కెట్ లో శుక్రవారం పుట్ట మధు చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. ప్రకృతి వైపరీత్యాలను ఆపడం ఎవరి తరం కాదని, ముందస్తుగా మార్కెట్లో రైతుల ధాన్యం తడవకుండా కవర్లు అందుబాటులో ఉంచామన్నారు.

గత ప్రభుత్వం రైతులు వరి వేస్తే ఉరి అని మీ అధినేత కేసిఆర్ బహిరంగంగానే తెలిపారని, ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఒక గింజ కోత లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులకు త్వరితగతిన డబ్బులను వారి అకౌంట్లో జమ చేయడం ద్వారా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రతి విషయంలోనూ మంత్రి శ్రీధర్ బాబు ను ముందు పెట్టి మాట్లాడడం తగదని, నియోజక వర్గానికి ఈ రాష్ట్రానికి అభివృద్ధిలో ముందు ఉంచాలని రాత్రి, పగలు మంత్రి కష్టపడుతున్నారని తెలిపారు. బహుజన వాదం బహుజనవాదమని మాట్లాడుతున్న నువ్వు, గత పది సంవత్సరాలు మీ పాలనలో బహుజనులను పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు.

ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే మంత్రి శ్రీధర్ బాబు ప్రతి కులానికి, ప్రతి వర్గాని ముందు ఉంచాలని, అన్ని కులాలకు సంఘ భవనాలు, కమ్యూనిటీ హాల్లను కోట్ల రూపాయలతో మంజూరు చేశారని, యూరియా కోసం రోడ్లోకి ధర్నా చేసి ఏదో సాధించిన అనుకుంటున్న నువ్వు అదే యూరియా మంథని వెంకటాపూర్ లో నీ ఫామ్ హౌస్ లో పండే వరి ధాన్యాన్ని ఎలా పండించవని చైర్మన్ వెంకన్న నిలదీశారు. రైతులకు అకాల వర్షాల దృష్ట రెండు కొత్త బాయిలర్లను తీసుకోవడం జరిగిందని, వాటిని త్వరలోనే ట్రాన్స్ఫారం ఫీడ్ చేసి వాటిని వాడుకలోకి చేసుకుంటామని, వాటి ద్వారా రైతులు త్వరితగతన వడ్లను ఆరబెట్టుకొని ధాన్యాన్ని మార్కెట్ కొనుగోలు చేస్తుందని తెలిపారు.

ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని పనిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సన్నబట్లకు బోనస్ను ప్రకటించడం జరిగిందని, ప్రకటించిన వెంటనే రైతులకు క్వంటాలకు రూ. 500 వందల బోనస్ను జమ చేయడం జరుగుతుందని, దీంతో రైతులు ఎంతో లాభపడుతున్నారని, ఇది రైతు రాజ్యం అని రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అన్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో క్వింటాకు రెండు నుండి ఐదు కిలోల కోత విధించడం జరిగింది. మిల్లర్లు దళారులు కుమ్మక్కై రైతులను మోసం చేశారని తద్వారా రైతు చాలా నష్టపోవడం జరిగిందని, ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. ఇంకోసారి మా ప్రియతమ నాయకుడు శ్రీధర్ బాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.