01-11-2025 08:53:17 PM
ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారున్ని చెట్టుకు కట్టేసిన కేసులో కాంట్రాక్టర్ అరెస్టు..
బోథ్ (విజయక్రాంతి): బోథ్ పోలీస్ స్టేషన్ నుండి పరారైన నిందితుడని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నామని బోథ్ ఎస్సై శ్రీసాయి తెలిపారు. శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. కోట(K) గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ కాంబ్లే సత్యనారాయణ అదే గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ళు లబ్ధిదారుని భర్త మారుతిని డబ్బుల విషయంలో చెట్టుకు కట్టి కొట్టిన కేసులో ఇటీవల బోథ్ పోలీసులు కాంట్రాక్టర్ ను అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఐతే గత 2 రోజుల క్రితం బాత్ రూమ్ కు వెళ్ళొస్తానని చెప్పిన సదరు కాంట్రాక్టర్ పోలీసుల కళ్ళు గప్పి స్టేషన్ నుండి పారిపోయాడు. కాగా పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తప్పించుకున్న నిందితుడు మహారాష్ట్ర పారిపోయాడన్న సమాచారం మేరకు అతని కోసం కాపుకాసరు. శనివారం సాయంత్రం అంతరాష్ట్ర చెక్పోస్ట్ అయిన ఘన్పూర్ వద్ద నిందితుని పట్టుకున్నామని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తామని వెల్లడించారు.