calender_icon.png 1 November, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో గోల్ఫ్ అండ్ టర్ఫ్ సమ్మిట్ ఇండియా 2025

30-10-2025 12:00:00 AM

హైదరాబాద్,అక్టోబర్ 29(విజయక్రాంతి): క్రీడారాజధానిగా పేరున్న హైదరా బాద్ మరో స్పోర్ట్స్ ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తోంది. ప్రతిష్టాత్మక గోల్ఫ్ అండ్ టర్ఫ్ స మ్మిట్ ఇండియా 2025 తొలిసారి గచ్చిబౌలీ బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ క్లబ్ వేదికగా జర గబోతోంది. గోల్ఫ్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ మెగా ఈవెంట్‌లో టర్ఫ్ మేనేజ్‌మెంట్, రియల్ ఎస్టేట్, గోల్ఫ్ ప్లేయర్స్‌తో పాటు గోల్ఫ్ అసోసియేషన్‌కు చెందిన ప్రతినిధులు, ఇతర ప్రముఖు లు పాల్గొంటున్నారు.

దేశవ్యాప్తంగా గోల్ఫ్ ను ప్రమోట్ చేయడం, గోల్ఫ్ కోర్సుల నిర్మా ణం, యువ గోల్ఫర్లకు అత్యుత్తమ శిక్షణ వం టి అంశాలపై ప్యానెల్ డిస్కషన్‌లో తమ అభిప్రాయాలు వెల్లడించనున్నారు. ఈ సమ్మిట్ ద్వారా హైదరాబాద్‌లో గోల్ఫ్‌కు మరింత ప్రోత్సాహం లభిస్తుందని జీఐఏ ఛైర్ పర్సన్ అనిరుధ సోలేకర్ చెప్పారు. ఇ లాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వ డం సంతోషంగా ఉందని టీగోల్ఫ్ ఫౌండర్ ఎన్‌ఆర్‌ఎన్ రెడ్డి చెప్పారు. గత కొంతకాలంగా గోల్ఫ్‌లో మహిళల ప్రాతినిథ్యం కూడా పెరుగుతుందన్నారు.