01-11-2025 08:52:04 PM
ధర్పల్లి,(విజయక్రాంతి): ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఎస్సై కళ్యాణి పోలీస్ సిబ్బందితో కలిసి మహాత్మా గాంధీ జ్యోతి రావు ఫూలే గురుకుల పాఠశాలలో విద్యార్తినులకు పోక్సో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శీ టీమ్స్ యొక్క ప్రాముఖ్యత, క్రిమినల్ చట్టాలలో మహిళలకు ఉండే హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్సై కళ్యాణి మాట్లాడుతూ... పాఠశాలలో ఉన్న విద్యార్థనులు ఏకాగ్రతతో గొప్ప చదువులు చదివి తమ తల్లి దండ్రులు గర్వపడే స్థాయిలో ఉండాలని, బాహ్య ప్రభావాలకు లోనవ్వకుండా ఎలాంటి లీగల్ సమస్యలున్నా పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని, స్వీయ రక్షణ ముఖ్యమని, ముఖ్యంగా అమ్మాయిలు ఎలాంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కుంటూ భవిష్యత్తులో ముందుకు వెళ్లాలని సూచించారు.