05-01-2026 01:13:17 AM
ఉదయం పూట ప్రయాణానికి ఆటంకం
మహబూబాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాను గత కొద్ది రోజులుగా పొగ మంచు వదలడం లేదు. ఆదివారం ఉదయం కూడా దట్టమైన పొగ మంచు అలముకుంది. ఫలితంగా వాహనాల రాకపోకలతో పాటు రైళ్ల రాకపోకలకు ఆటంకంగా మారింది. ఆదివారం సెలవు రావడంతో మేడా రం జాతరకు పెద్ద ఎత్తున వాహనాల్లో భక్తులు తరలి వెళ్లారు. ఈ క్ర మంలో పొగ మంచు వల్ల హనుమకొండ, ములుగు, మేడారం మార్గం లో వాహనాలు వేగం తగ్గించి వెళ్లాల్సి వచ్చిం ది. ఓవైపు దట్టమైన పొగ మంచు, మరోవైపు చలి తీవ్రత ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలను కొద్దిరోజులుగా ఇబ్బంది పెడుతోంది.
పొగ మంచు కారణంగా వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని, వేగం తగ్గించి వాహనాలను నడపాలని, రోడ్ల వెంట ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేయవద్దని, ఉద యం పూట కూడా వాహనాలకు హెడ్లైట్ వెలిగించి నడపాలని, ప్రమాదాలకు గురికాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసు లు వాహనదారులను హెచ్చరిస్తున్నారు.