calender_icon.png 10 January, 2026 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారమిత పాఠశాల విజ్ కిడ్ కాంటెస్ట్ విశేష స్పందన

05-01-2026 01:14:10 AM

ముకరంపుర, జనవరి 4 (విజయక్రాంతి): నగరంలోని పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాలలో నిర్వహించిన విజ్ కిడ్ కాంటెస్ట్ కి విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించింది. రాష్ట వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుండి 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు గల దాదాపు 3500 కి పైగా విద్యార్థులు ఈ పరీక్షను రాసారు. ఈ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతీ తరగతి నుండి పదిమంది విద్యార్థులకు నగదు బహు మతి, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేస్తామని, అన్ని తరగతులకు కలిపి  మొత్తం నగదు పురస్కారం 4 లక్షల రూపాయలను అందజేస్తామని  పారమిత పాఠశాలల చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ ప్రసూ న, రష్మిత, రాకేష్, అనుకర్ రావు, వినోద్ రావు, వి.యు.యం. ప్రసాద్, హన్మంతరావు, ప్రిన్సిపాల్ గోపీకృష్ణ, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.