calender_icon.png 20 November, 2025 | 9:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులవృత్తులకు పూర్వవైభవం

20-11-2025 12:00:00 AM

  1. మాన్వాడ జలాశయంలో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే 

బోయినపల్లి లో కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

బోయినపల్లి: నవంబర్ 19 ( విజయ క్రాంతి): కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకురావడంతోపాటు , కుల వృత్తుల వారంద రికీ ఉపాధి కల్పించాలి అన్నదే ప్రభుత్వ లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక వద్ద శ్రీ రాజరాజేశ్వర జలాశయంలో మత్స్యకారులకు ప్రభుత్వం పంపిణీ చేసిన చేప పిల్ల లను వదిలిపెట్టారు.

అనంతరం బోయినపల్లి మండల కేంద్రంలో రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కులవృత్తులతోపాటు అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అని చెప్పారు. ఇందుకు నిధుల కొరత ఏమి లేదని కుల వృత్తుల వాళ్లు, రైతులు అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నారాయణరెడ్డి, ఎంపీడీవో భీమా జయశీల, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, బోయినపల్లి సింగిల్ విండో చైర్ పర్సన్ జోగినపల్లి వెంకట రామారావు, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, మాజీ ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్య క్షులు కూస రవీందర్,మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ వన్నెల రమణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉ మ్మడి జిల్లా నాయకులు వరాల నరసింగం, కాంగ్రెస్ నాయకులు సంబ లక్ష్మీరాజo, ఏనుగుల కనకయ్య, భీమ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.