calender_icon.png 20 November, 2025 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదక ద్రవ్యాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి

20-11-2025 12:00:00 AM

కలెక్టర్ జితేష్ వి. పాటిల్ 

భద్రాద్రి నవంబర్ 19 విజయ క్రాంతి;  జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీ జిల్లాలో నమోదవుతున్న కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల వాడకం నియంత్రణ, శాఖలవారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజల్లో అ వగాహన పెంపు వంటి అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ వినియో గం వల్ల సమాజంపై పడుతున్న ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, శాఖలు నిరంతర పర్యవేక్షణతో కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్ శాఖ నిర్వహిస్తున్న చైతన్యం కార్యక్రమం ద్వారా యువతలో అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో దీనిని మరిన్ని గ్రామాలు, పాఠశాలలు, కళాశాలలకు విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. యువతను మాదకద్రవ్యాల అలవాటు వైపు మళ్లకుండా ఆరోగ్యకరమైన దిశలో నడిపేందుకు శని, ఆదివారాల్లో క్రీడా కార్యక్రమాలు, జుంబా డాన్స్, ట్రెక్కింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించా రు.

పాల్వంచలోని శ్రీనివాస గుట్టలో ప్రత్యేక ట్రెక్కింగ్ కార్యక్రమం చేపట్టి, అక్కడ మొక్క లు నాటే కార్యక్రమాన్ని ప్లాన్ చేయాలని అధికారులను ఆదేశించారు.అటవీశాఖ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించ డం కోసం వనవిహారాల్లో కుటుంబాలు, పి ల్లలు ఉపయోగించే సౌకర్యాలను మరింత వి స్తరించాలని కలెక్టర్ సూచించారు. అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు కనిపించిన వెంటనే సమాచారాన్ని పోలీసులకు చేరవేసి తక్షణ చర్యలు నిర్ధారించాలని తెలిపారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి, వారికి అవసరమైన చికిత్స, కౌన్సెలింగ్ అందించేందుకు డీ-అడిక్షన్ సెంటర్ల పనితీరును బలోపేతం చేయాలని సూచించారు.

జిల్లాలోని ఆసుపత్రులు, మెడికల్ షాపుల్లో ఔషధాల స్టాక్ వివరాలను ప్రతి నెల క్రమం తప్పకుండా తనిఖీ చేసి, అక్రమ విక్రయాలను అరికట్టాలని డ్రగ్ ఇన్స్పెక్టర్కు ఆదేశించారు. ఇంటర్ కళాశాలల్లో డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, విద్యార్థుల్లో మాదక ద్రవ్యాలపై చైతన్యం పెంచాలని సూచించారు.

ఎవరైనా మాదకద్రవ్యాలు వినియోగించిన లేదా సాగు చేపట్టిన, సరఫరా చేసిన ఆ వివరాలను 1908 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని కలెక్టర్ తెలిపారు.ఈ సమా వేశం లో ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రా థోడ్, రవాణా శాఖ అధికారి వెంకటరమణ, పోలీస్ మరియు అటవీశాఖ అధికారులు, డ్రగ్ కంట్రోల్ శాఖ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.