గచ్చుబావికి పూర్వ వైభవం
శతాబ్దాల క్రితం కల్వకుర్తి ప్రజల దాహం తీర్చేందుకు నిర్మించిన చిన్న చేదురు బావి.. కొన్నాళ్లకు మెట్ల బావిగా.. గచ్చుబావిగా అవతరించింది. పట్టణ విస్తీర్ణం పెరగటం చేదురు బావులు కనుమరు కావడంతో గచ్చుబావి కాలక్రమేణా నిరాదరణకు గురైంది. ఎగువ నుంచి వర్షపు నీరు బావిలోకి చేరడం, చెత్తా చెదారాన్ని సైతం అందులో వేయడంతో సుమారు 20 అడుగుల మేర మట్టి పేరుకు పోయింది. కల్వకర్తి పట్టణంలోని శుభాష్‌నగర్ కాలనీలోని గచ్చుబావి వద్ద ఉన్న శివాలయంలో పూజలు చేస్తున్నప్పటికీ గచ్చుబావి మాత్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు.
దీన్ని గమనించిన యువత పురాతన కట్టడమైన గచ్చుబావిని కాపాడుకోవాలనే సంకల్పంతో ‘సేవ్ గచ్చుబావి.. సెల్ఫీ విత్ గచ్చుబావి’ అనే నినాదంతో సామాజిక మాధ్యమంలో ముమ్మరంగా ప్రచారం చేశారు. దీనితో కల్వకుర్తి పట్టణానికి చెందిన వివిధ పాఠశాల విద్యార్థులు, యువకులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు ఐక్యత చాటుతూ గచ్చుబావి పూర్వవైభవమే లక్ష్యంగా గత 44 రోజుల పాటు శ్రమిస్తూ.. శుద్ధి చేస్తున్నారు. రోజుకో బృందం స్వచ్ఛందంగా వచ్చి, బావి శ్రమదానంలో భాగమవుతు న్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీ భారీ ఇటాచీ, మూడు ట్రాక్టర్ల ద్వారా పూడిక తొలగిస్తోంది. ఉబికి వస్తున్న నీళ్లను మూడు మోటార్ల ద్వారా బయటికి పంపుతూ.. పనులు చేస్తున్నారు.
శ్రామికుల శాపంతోనే నిరాదరణకు గురైన బావి
వడ్డె రాజులు రాజు వద్దకు వెళ్లి గుడి ద్వజ స్తంభం, నంది విగ్రహం ఏర్పాటుకు ధనం అవసరమయ్యా యి. అందుగ్గాను రాజు దగ్గరికి వెళ్లగా..అప్పుడు రాజు, ధాన్యం కొలిచే పెద్ద తూముకు బదులుగా, గొడ్డలి కాడపరిమాణంలో ఉండే ఒక చిన్న తూములో ధనాన్ని పోసి వారికివ్వజూపాడు. మేము ఊహించిన తూమెడు ఇదికాదని శ్రామికులు వాపో గా, ఇస్తానన్నది ఇదేనని రాజు బదులిచ్చాడు. ఈ మోసాన్ని గ్రహించిన శ్రామికులు ఆగ్రహంతో రగిలిపోయారు. తమ శ్రమను అవమానించినందుకు ప్రతిగా, ‘ఈ బావి గానీ, ఇక్కడి శివాలయం గానీ ఎప్పటికీ అభివృద్ధికి నోచుకోవు.
ఇలాగే శిథిలావస్థలో పడి ఉంటాయి’ అని శపించారని పెద్దల నాణుడి. ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో కళకళలాడిన ఈ బావిని ఎవరూ పట్టించుకోకపోవడంతో దశాబ్దాలుగా చెత్తాచెదారం పేరుకుపోయి శిథిలావస్థకు చేరింది. ప్రస్తుతం పట్టణ యువకులు ముందుకు రావడంతో బావికి పూర్వవైభం రోజురోజుకూ సంతరించుకుంటోంది. భారీ యంత్రాలతో మట్టిని తొలగిస్తుండడం చూసి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
‘గచ్చుబావి’కి పూర్వవైభవం తెచ్చేందకు కల్వకుర్తి పట్టణం అంతా తలమునకలైంది. 450 ఏళ్ల చరిత్ర గల బావి పునరుద్ధరణకు 44 రోజుల క్రితం యువత నడుం బిగించి, శంకానాదం మోగించింది. సేవ్ గచ్చుబావి.. సెల్ఫీ విత్ గచ్చుబావి పేరుతో సోషల్ మీడియాలో చేసిన అవేర్‌నెస్.. విద్యార్థులు, యువత, ప్రజలు, వివిధ సంఘాల వారు, అధికారుల హృదయాలను సైతం తట్టి లేపింది. గచ్చుబావిని మళ్లీ బతికించేందకు, గత వైభవం తెచ్చేందుకు మేము సైతం సిద్ధమంటూ రోజుకో బృందం తరలివస్తోంది.
దీంతో పనరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారీ ఇటాచీ వాహనంతో బావిలోని పూడికను తీస్తుండగా, మూడు ట్రాక్టర్ల ద్వారా పక్కకు తరలిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఊరుతున్న నీటిని మూడు మోటార్ల ద్వారా బయటికి పంపింగ్ చేస్తున్నారు. దీంతో రోజురోజుకూ గచ్చుబావి గత వైభవాన్ని సంతరించుకోవడం చూసి ప్రజలు సంభ్రమాశ్చర్యలకు గురవుతున్నారు.
చారిత్రక నేపథ్యం
సుమారు 450ఏళ్ల క్రితం, రాజుల కాలంలో ప్రజల తాగునీటి అవసరాల కోసం ఈ బావిని నిర్మించారు. మొదట చిన్నదిగా ఉన్న చేదురు బావిని ప్రజలందరి సౌలభ్యం కోసం ఒక విశాలమైన మెట్ల బావిగా మార్చాలని అప్పటి రాజు సంకల్పించాడు. సుమారు 200 నుంచి 280 అడుగుల లోతు వరకు తవ్వించి, రాతి మెట్లను నిర్మించేందుకు వడ్డె రాజులకు పని అప్పగించాడు. వారి కష్టానికి ప్రతిఫలంగా ధనం ఇస్తానని రాజు వాగ్దానం చేశాడు. రాజు సూచన మేరకు బండరాళ్లను పగలగొట్టి అందమైన మెట్లుగా తీర్చిదిద్దారు.
నిర్మాణం జరుగుతుండగా రాళ్ల మధ్యలో సున్నం, బంకమట్టి మిశ్రమంతో ప్రత్యేకమైన గచ్చును ఉపయోగించి మెట్లు ఏర్పాటు చేశారు. దీంతో బావికి గచ్చుబావిగా పిలవబడింది. నీటి ఊటలు అధికమవ్వడంతో అవి ఆగాలంటే భావి వద్ద పరమ శివుడిని నెలకొల్పాలని ఆలయానికి సూర్యకిరణాల నీడ ఆధారంగా గుడి నిర్మాణం జరగాలని ఓం మహా ముని రాజుకు సూచించారు. దీంతో బావి పైభాగంలో, సూర్యకిరణాల నీడ ఆధారంగా ఒక శివాలయాన్ని నిర్మించి పూజలు ప్రారంభించారు.
కల్వకుర్తి, డిసెంబర్ 27 (విజయక్రాంతి)




