27-12-2025 06:42:38 PM
వ్యక్తిత్వ వికాస నిపుణులు మాచన రఘునందన్
హైదరాబాద్: ధూమపానం, పొగాకు వంటి దురవాట్లకు లోనయ్యే బదులు.. "మా వాడు ఫలానా ఉద్యోగంలో ఉన్నాడు" అని తల్లిదండ్రులు చెప్పుకుని గర్వపడే స్థాయికి యువత చేరుకోవాలని పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తాశిల్దార్, టుబాకో కంట్రోల్ హీరో అవార్డు గ్రహీత మాచన రఘునందన్ స్పష్టం చేశారు. శనివారం ఆయన తన జన్మ దినోత్సవం సందర్భంగా రఘునందన్ తన మాతృమూర్తి మాచన విజయ ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. "మీ వాడు సిగరెట్ తాగుతాడా?! మేం చూశాం" అని వాళ్ళు వీళ్ళు మన అమ్మనాన్నలకు చెప్తుంటే మనకు జన్మ ఇచ్చినందుకు "చ్చి ఇలాటి వాడికా నేను తండ్రిని, తల్లిని" అని బాధ పడకుండా ఉండేలా చక్కటి నడత కలిగి ఉండాల్సిన అవసరం అటు యువత కు, ఇటు విద్యార్థులకు ఉన్నదని రఘునందన్ సూచించారు. ఉన్నత లక్ష్యం దిశగా యువత పద నిర్దేశం చేసుకోవాల్సిన బాధ్యత నవ తరం పై ఉన్నదని రఘునందన్ హితవు చెప్పారు.